పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్, మర్కజ్ తైబా, మురిద్కే, సర్జల్ / టెహ్రా కలాన్, మెహమూనా జోయా ఫెసిలిటీ, సియాల్‌కోట్, మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, భీంబర్, మర్కజ్ అబ్బాస్, కోట్లి, మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్‌లోని షావాయి నల్లా క్యామ్, మర్కజ్ సయ్యద్నా బిలాల్ లో మెరుపు దాడులు చేసింది. భారత్ చేపట్టిన ఈ ప్రతీకార చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టారు. పాక్ పై భారత్ వైమానిక దాడులపై అసదుద్దిన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read:HHVM : వీరమల్లు రిలీజ్ డేట్ పై ముంబైలో మకాం వేసిన నిర్మాత
AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారతదేశం తీసుకున్న ఈ చర్యను అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ దాడులను నేను స్వాగతిస్తున్నాను అని అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్‌లో రాశారు. మరో పహల్గామ్ ఘటన మళ్లీ జరగకుండా పాకిస్తాన్ లోతైన రాజ్యానికి గట్టి గుణపాఠం నేర్పించాలి. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి. జై హింద్! అంటూ వెల్లడించారు.
मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025