పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తోందని, పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. భారత జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. చచ్చే వరకు భారత భూమి కోసమే బ్రతకాలని ఎమోషనల్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హైదరాబాద్ ఎంపీ అన్నారు.
Also Read: Terrorists Killed: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి.. ఐదుగురు కీలక టెర్రరిస్టులు హతం!
‘అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు. జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదు. ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తుంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి’ అని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈరోజు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఒవైసీ పాల్గొన్నారు.