ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశారు. గుజరాత్‌లోని జునాగఢ్, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లలో ముస్లిం పురుషులను కొట్టిన రెండు సంఘటనలపై తీవ్రంగా స్పందించారు.
Giriraj Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విరుచుకుపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర కొల్హాపూర్ ఘర్షణ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓవైసీ విమర్శలు గుప్పించారు.
Asaduddin Owaisi: ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై ఓ వర్గం అనుకూల సోషల్ మీడియా పోస్టులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
Bandi Sanjay: దారుస్సలాంలో కూర్చొని ఎంఐఎం ప్రేలాపనలు చేస్తోందని, దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ని చంకలేసుకొస్తారో, కాంగ్రెస్ తో కలిసి వస్తారో రండి, బీజేపీ సింహంలా సింగిల్ గా వస్తుంది, ఎంఐఎంకి డిపాజిట్లు కూడా రానీయకుండా చేస్తాం అని అన్నారు. ఇన్నేల్లుగా పాతబస్తీని ఎందుకు డెవలప్ చేయలేదని ఎంఐఎంని ప్రశ్నించారు. ముస్లిం యువకులకు పాస్ పోర్టు కూడా లేని పరిస్థితి ఎందుకు…
Asaduddin Owaisi: హైదరాబాద్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఫైర్ అయ్యారు.
MP Asaduddin: కాంగ్రెస్ అస్తిత్వం కోల్పోతోందని, ఆ పార్టీని అందరూ వీడుతున్నారని, కాంగ్రెస్ లో ఓవైసీ లాంటి మొగాడెవరూ లేరా? అంటూ AIMIM అధ్యక్షుడు, MP అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రేస్ అధ్యక్షుడు రేవంత్ ప్రతి నియోజకవర్గంలో రాం మందిరాలు నిర్మిస్తామన్నారని తెలిపారు. హజ్ కు వెళ్ళే వాళ్ళపై కాంగ్రేస్ హయాంలోనే రాళ్ళు రువ్వారని గుర్తు చేశారు. నాన్ సెక్యులర్ BJP మజ్లిస్…
Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్మానించకుండా ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఏంటని..? ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ కార్యక్రమాన్ని 20కి పైగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, జేడీయూ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆప్, ఆర్జేడీ పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.
Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మే 28న ప్రధాని నరేంద్రమోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి
Asaduddin Owaisi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు, రేపు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మాజీ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ తరుపు నుంచి హుబ్బళి నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఆయన కోసం సోనియా గాంధీ శనివారం ప్రచారం చేశారు.
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.