Asaduddin Owaisi: మతం ఆధారంగా కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసద్దుదీన్ ఓవైసీ. హుబ్లీలో కూల్చివేసిన దర్గా పునర్మిర్మానికి కాంగ్రెస్ హామీ ఇస్తుందా..? అని ప్రశ్నించారు. బీజేపీతో సైద్ధాంతిక పోరాటానికి లొంగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలత్లో హనుమాన్ ఆలయాల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారి రిజర్వేషన్లను తొలగిస్తామని హామీ ఇస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నేత అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ను గతవారం పోలీసుల కస్టడీలోనే మీడియా ముందు దారుణంగా తుపాకులతో కాల్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కొత్త ప్రశ్నలను లేవనెత్తారు.
Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు నిందితులంతా నిర్దోషులే అని కీలక తీర్పు వెలువరించింది. అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం ఈ తీర్పును ప్రకటించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, మాజీ భజరంగ్ దళ్ నాయకుడు బాబు బజరంగి సహా మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో కోర్టు చెప్పిన తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కవి రహత్ ఇండోరి కవితను…
Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ పై రాజకీయ దుమారం రేగుతోంది. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను ఫిబ్రవరిలో హత్య చేశారు. ఈ కేసులో అతీక్ అహ్మద్, అతని కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు.
Asaduddin Owaisi: బీహార్ పర్యటనలో ఉన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. బీహార్ కిషన్ గంజ్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ కేసీఆర్ పాలనను పొగిడారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన విలువైన పాలనను అందించారని అన్నారు. బీహార్ సీమాంచల్ ప్రాంతంలో పర్యటన ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ‘సీమాంచల్ అధికార యాత్ర’లో ప్రసంగిస్తూ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం నితీష్ కుమార్ వల్లే తమ ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారంటూ మండిపడ్డారు. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచ్ ప్రాంతంలో ఓవైసీ మూడు రోజులు పర్యటించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీమాంచల్ ప్రజలపై చూపిస్తున్న విపక్షకు వ్యతిరేకంగా మార్చి 18, మార్చి 19 తేదీల్లో ‘సీమాంచల్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను హాజరవుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Asaduddin Owaisi: నాగాలాండ్ రాష్ట్రంలో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ, బీజేపీ సంకీర్ణానికి మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. నాగాలాండ్ ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నేఫియు రియోకు మద్దతు ప్రకటించిన తర్వాత అసదుద్దీన్ శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ ఎన్డీపీపీ-బీజేపీ పార్టీలు 37 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
Assembly Election 2023: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వెలుపల కూడా తమ పార్టీని విస్తరించడంలో నిమగ్నమయ్యారు. ఇందుకు ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు.