Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ‘‘ఆర్ఎస్ఎస్కి చోటా రీఛార్జ్’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఢిల్లీలో సుందరాకాండ పారాయణం చేయాలని ఆప్ నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ఓవైసీ విమర్శించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదుల విషయంలో ముస్లిం సమాజానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Dhirendra Shastri: రామాలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో, కేంద్రం చేస్తున్న కార్యక్రమాలపై ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి శుక్రవారం స్పందించారు. ‘‘ఇది అతడి భయాన్ని తెలియజేస్తోందని, మేము మసీదులపై మందిరాలను నిర్మించడం లేదని, దేవాలయాలను పునర్నిర్మించాలని అనుకుంటున్నామని, అతడికి ఈ భయం ఉంటే, ఆ భయంతోనే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఓవైసీని ఉద్దేశిస్తూ అన్నారు.
ఈరోజు ఉదయం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షింతలను అందజేశారు.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ నుంచి తీసేసుకునే ఛాన్స్ ఉందన్నారు.
Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్లో తన పోస్ట్ను తొలగించారు. ఈ వివాదం ముదిరి పాకాన పడడంతో ఆయన అలాంటి చర్య తీసుకున్నారు.
రాజేంద్రనగర్ లోని శాస్త్రిపురం వట్టేపల్లిలోని సెంట్ ఫాయజ్ పోలింగ్ బూత్ నంబర్ 400లో తన ఓటు హక్కును ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. శాస్త్రిపురంలో నా ఓటు హక్కు వినియోగించుకున్నాను..
Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరో వివాదంలో ఇరుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ర్యాలీలో పోలీసులను బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమయానికి మించి ప్రచారం చేయడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై పోలీసులు అభ్యంతరం చెప్పడంతో అక్బరుద్దీన్ ఓవైసీ పోలీస్ ఇన్స్పెక్టర్ని బెదిరించాడు.
Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో ఎనిమిది రోజుల్లో పోలింగ్ ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Asaduddin Owaisi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మరోసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఇతరులపై వేళ్లు చూపించే ముందు తనను తాను అద్దంలో చూసుకోవాలని శనివారం అన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు.