Asaduddin Owaisi: తమిళనాడులో కొత్త పొత్తు పొడిచింది. హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అప్నాదళ్(కే)తో పొత్తు కుదుర్చుకున్న మజ్లిస్ పార్టీ, ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో మభ్య పెట్టిందని, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం అన్నాడు కానీ అయ్యనొక్కడే ఇల్లు కట్టుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇళ్లు ఇస్తామంది కానీ ఇంకా జరగలేదన్నారు. భారతీయ ఆత్మ దేవాలయాలని, ఆదర్శ వ్యక్తి రాముడు.. ఇప్పుడు ఆయనకు గుడిని నిర్మించుకున్నామన్నారు కిషన్ రెడ్డి. రామ భక్తుడిగా మోడీ రాముడి దేవాలయాన్ని నిర్మించారని, ఇప్పుడు 302 సీట్లు ఉన్నాయి.. ఈ…
ఈ దేశంలో పేదలు, దళితులు, మైనారిటీలు, ముస్లింలకు చోటు లేకుండా చేయడమే సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ లక్ష్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అత్యంత కీలకమై రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీ, అప్నాదళ్(కామెరవాడి) మధ్య పొత్తు కుదిరింది.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సవరించిన చట్టం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
AIMIM : లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఓ కీలక ప్రకటన చేశారు. బీహార్‌లోని 11 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఒవైసీ ప్రకటించారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. CAA నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
BJP : భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ పొందిన అభ్యర్థుల్లో హైదరాబాద్, తెలంగాణకు చెందిన మాధవి లత కూడా ఉన్నారు.
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుపున పలువురు భారతీయులు పోరాడుతున్నట్లు సమాచారం ఉంది. భారతీయులు బలవంతంగా ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్నట్లు నివేదికలు వస్తున్న నేపథ్యంలో భారతదేశం శుక్రవారం తన పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయులు ‘‘జాగ్రత్తగా వ్యవహరించాలి, వివాదాలకు దూరంగా ఉండండి’’ అని సూచించింది.
Telangana Youth: రష్యాలో సెక్యూరిటీ గార్డు, హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని బ్రోకర్ల వలలో చిక్కుకోవడంతో 12 మంది భారతీయ యువకులు ప్రస్తుతం ప్రాణ భయంతో ఉన్నారు.