Pema Khandu: “సూర్యుడు ఉదయించే రాష్ట్రం”లో కమలాన్ని వికసింపచేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pema Khandu: చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ రోజు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 60 సీట్లకు గానూ ఏకంగా 46 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్నికల ముందే 10 అసెంబ్లీ సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంది. వరసాగా మూడో సారి బీజేపీ అరుణాచల్‌లో అధికారంలోకి రాబోతోంది. ఈ విజయానికి కారణంగా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు పెమా ఖండూ. రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ఇతను ఈశాన్య రాష్ట్రంలో మొదటిసారిగా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చాడు.
దేశంలో సూర్యుడు మొదటగా ఉదయించే రాష్ట్రంగా పేరున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఓ సూర్యుడిలా పెమా ఖండూ మారారు. 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో అతని తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ అకాల మరణంతో రాజకీయంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి కీలక వ్యక్తిగా మారారు. 2000లో కాంగ్రెస్‌లో చేరి వివిధ పదవులు చేపట్టినప్పటికీ, తన తండ్రి నియోజకవర్గం ముక్తో నుంచి ఉపఎన్నికల్లో పోటీ లేకుండా గెలిచిన తర్వాత ఆయన ఎదుగుదల వేగంగా సాగింది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Read Also: MP: భార్యపై అనుమానంతో అతి కిరాతకంగా హతమార్చిన భర్త.. శరీరాన్ని14 ముక్కలు చేసిన వైనం
నబమ్ టుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగా పనిచేసిన పెమా ఖండూ పనిచేశారు. జనవరి 2016 రాజ్యాంగ సంక్షోభం కారణంగా రాష్ట్రపతి పాలన విధించడానికి దారి తీసింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏర్పడి కలిఖోపుల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పెమా ఖండూ మంత్రి అయ్యారు. అయితే, కొంతకాలం మాత్రమే అధికారం కొనసాగింది. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ నబమ్ టుకీ ప్రభుత్వం మళ్లీ పునరుద్దరించబడింది. ఇతని రాజీనామా తర్వాత 37 ఏళ్ల వయసులో పెమా ఖండూ జూలై 2016లో సీఎం అయ్యారు.
కాంగ్రెస్‌లో ఉన్న పెమాఖండూ 2016లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(పీపీఏ)కి, అదే ఏడాది డిసెంబర్‌లో బీజేపీలో చేరారు. ఇతని పదవీకాలం ప్రారంభమైన మూడు నెలలకే 43 మంది అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ మిత్రపక్షమైన పీపీఏలోకి ఫిరాయించారు. అంతర్గత విభేదాల వల్ల పీపీఏ పెమాఖండూని సస్పెండ్ చేయడంతో, పీపీఏ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరడంతో మరింత బలపడ్డారు. 2019లో పెమా ఖండూ ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి రెండోసారి గెలిచి ఎలాంటి రాజకీయ అవరోధాలు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!