Article 370: జమ్మూకాశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక అధికరణ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ అంశాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అక్రమం అంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సోమవారం రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో ఉన్నారు అధికారులు.
India At UN: సమావేశ అజెండాతో సంబంధం లేకుండా దాయాది దేశం పాకిస్తాన్ ప్రవర్తించడం సాధారణంగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై సమావేశం జరిగినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు పాక్ వైఖరిని భారత్ తూర్పారపట్టింది. అయినా కూడా తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఇప్పటికే చాలా సార్లు ఇది తమ అంతర్గత వ్యవహారమని, భారత్ లో జమ్మూ కాశ్మీర్ భాగంగా ఉంది, ఉంటుంది అని భారత్ ఘాటుగానే స్పందిస్తోంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ 2023లో శనివారం ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వాటిని రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ని విమర్శించారు. గతంలో ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ సాయం కోసం ప్రపంచానికి విజ్ఞప్తి చేసేదని, ఇప్పుడు దాడుల వెన ఉన్న దేశాలు తమను రక్షించాలని కోరుతున్నాయని అన్నారు.
Article 370: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూకాశ్మీర్ ని రెండుగా విభజించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
Article 370 hearing: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Supreme Court: ఆర్టికల్ 370ని తొలగించడానికి ముందు జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులను కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A భారతదేశ ప్రజల ప్రాథమిక హక్కులన్నింటినీ తొలగించింది.
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జమ్మూ, కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
Kulgam Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. రాత్రి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారించనుంది. సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో పిటిషన్లపై విచారణ ఉంటుంది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో అపూర్వమైన శాంతి నెలకొందని కేంద్రం వెల్లడించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్ధించుకుంది. అది ముమ్మాటికీ సరైన నిర్ణయమే అని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు సోమవారం 20 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది.