Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాశ్మీర్ భద్రతపై అధికారుల సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Article 370: జమ్మూకాశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక అధికరణ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఈ అంశాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అక్రమం అంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సోమవారం రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో ఉన్నారు అధికారులు.
Also Read
- Nitish Setu: గంగానదిపై "నితీశ్ సేతు"ను ప్రారంభించిన మోదీ!
- Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
- Rahul Gandhi vs Kiren Rijiju: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. 1962 యుద్ధం, పేదరికంపై కాంగ్రెస్‌కు 4 ప్రశ్నలు!
- Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
సుప్రీం తీర్పుకు ముందు లా అండర్ ఆర్డర్ గురించి చర్చించేందుకు పోలీసులు, అడ్మినిస్ట్రేషన్, ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం శ్రీనగర్‌లో సమావేశమయ్యారు. జమ్మూకాశ్మీర్ పోలీస్ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఎవరైనా దుష్ప్రవర్తనకు పాల్పడినా, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ డీజీపీ(లా అండర్ ఆర్డర్) విజయ్ కుమార్, కాశ్మీర్‌లోని కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన మీటింగ్‌కి అధ్యక్షత వహించారు. ఆర్టికల్ 370 కేసులో సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు అందాయి.
తాజావార్తలు
-
Fire Accident : హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
-
Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి కళ్లుచెదిరే విరాళం.. ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలు..
-
Nitish Setu: గంగానదిపై “నితీశ్ సేతు”ను ప్రారంభించిన మోదీ!
-
Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!