Lover: ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం, ప్రియురాలిని మెప్పించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తారు. తన వైపు తిప్పుకునేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు. అయితే ప్రియురాలిని తనవైపు తిప్పుకునేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు దొంగతనాలకు తెర తీశాడు. ఆమెకు బహుమతులు ఇచ్చేందుకు దొంగతనం చేసి ప్రియురాలికి రూ. 60 లక్షల విలువైన బహుమతిని ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో దంపతులతో పాటు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో చోటుచేసుకుంది. 22 ఏళ్ల పరాస్ తివారీ 24 ఏళ్ల మహిమా సింగ్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఆకట్టుకునేందుకు, ఆమె కోరికలు తీర్చుకునేందుకు దొంగతనానికి పాల్పడ్డాడు. ఇందుకోసం ప్రత్యేక ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి దొంగతనాలు, దోపిడీలు చేసేవారు. నగర శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేశారు. ముఖ్యంగా ఖరీదైన ఇళ్లు, నగల దుకాణాలు టార్గెంట్ చేస్తూ దొంగతనం చేసేవారు. దోచుకున్న డబ్బు, నగలను పరాస్ తివారీ తన స్నేహితురాలు మహిమా సింగ్‌కు ఇచ్చేవాడు. మరికొన్ని నగల దుకాణాల్లో వెండి, బంగారు ఆభరణాలు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. పరాస్ తివారీ ముఠా ఇటీవల భారీ దోపిడీకి పాల్పడింది. దోచుకున్న సొమ్ములో నుంచి రూ. 60 లక్షలు తన స్నేహితురాలు మహిమా సింగ్‌కు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో అసలు సమస్య మొదలైంది.
పోలీసులు కేసు నమోదు చేసి చోరీ, దోపిడీ కేసులన్నింటినీ దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసుకలు తివారీ ముఠా గురించి తెలిసింది. దీంతో పోలీసులు చాకచక్యంగా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయం సమీపంలో పరాస్ తివారీ ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. 9 లక్షల డబ్బు, రూ.8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఆయుధాలు, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా మొత్తం వ్యవహారం బయటపడింది. పరాస్ తివారీ, అతని స్నేహితురాలు మహిమా సింగ్‌తో పాటు మరో నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Part Time Jobs: పార్ట్ టైం జాబ్ పేరిట టెలిగ్రామ్ మెసేజ్.. లక్షలు కొట్టేసిన కేటుగాళ్ళు