Molestation : ఫ్రెండ్ పెళ్లాంపై కన్నేశాడు.. ముక్కలు ముక్కలయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Molestation : స్నేహితుడి భార్యను మోహించిన యువకుడు ఆ దంపతుల చేతిలోనే కుక్క చావుచచ్చాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. స్నేహితుడిని హత్య చేసిన అనంతరం ఆ భార్యభర్తలు కత్తితో అతడి శరీరాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి కాలువలో పడేశాడు. నిందితుల జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహంలోని ఎనిమిది ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా భాగం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Tragedy : కోట్లు సంపాదించిపెట్టారు.. కొడుకులు కూడు పెట్టకపోవడంతో ఉసురుతీసుకున్నారు
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ఇమ్రాన్, రిజ్వానా ఇద్దరు దంపతులు. ఇమ్రాన్ స్నేహితుడు మెహరాజ్ పఠాన్. మెహ్రాజ్ తన స్నేహితుడు ఇమ్రాన్ భార్య రిజ్వానా సుల్తాన్‌పై చెడు దృష్టి పెడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆమెతో సరసాలాడుతూ శారీరక సంబంధాల కోసం ఒత్తిడి తెచ్చేవాడు. చివరకు ఈ విషయాన్ని రిజ్వానా తన భర్త ఇమ్రాన్‌కు తెలియజేసింది. దీని తర్వాత వారిద్దరూ మెహ్రాజ్‌కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఇమ్రాన్ మెహ్రాజ్‌ని తన ఇంటికి ఆహ్వానించాడు. తర్వాత సర్ ప్రైజ్ ఇస్తానన్న పేరుతో కళ్లకు కండువా కట్టాడు. ఆపై ఇమ్రాన్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. దీని తరువాత, ఇద్దరూ మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి, మృతదేహాన్ని కాలువలోకి విసిరారు. మరోవైపు, మెహ్రాజ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత మెహ్రాజ్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also:PM Modi: ప్రధాని డిగ్రీ వివరాలు అవసరం లేదు.. కేజ్రీవాల్‌కి హైకోర్టు జరిమానా..
ఇమ్రాన్ ఇంటికి వెళుతున్నానని చెప్పి మెహ్రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. విచారణలో పోలీసులకు అనుమానం రావడంతో పోలీసులు అతడిని క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఆ తర్వాత నేరం అంగీకరించి అన్ని విషయాలు చెప్పాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మొండెంనకు చెందిన ఎనిమిది ముక్కలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తల కోసం గాలిస్తున్నారు. కాల్వలో నీటి ప్రవాహానికి యువకుడి తల కొట్టుకుపోయి ఉండొచ్చని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!