Man Bit SI’s Ear : కేరళలో రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులకు చేదు ఘటన ఎదురైంది. తప్పతాగి రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రమాదానికి కారణమయ్యాడని ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్కు తరలిస్తుండగా ఎస్ఐ చెవి కొరికి గాయం చేశాడు. సదరు ఎస్ఐను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కాసరగాడ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసరగాడ్ లో బైక్ పై వెళ్తున్న స్టెనీ రోడ్రిగ్జ్ అనే వ్యక్తి ఒక వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Vande Metro Services : త్వరలో పట్టాలెక్కనున్న వందే మెట్రో రైళ్లు
పోలీసు వాహనంలో అతన్ని పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు. ఎస్ఐ విష్ణుప్రసాద్ పోలీస్ వాహనంలో ముందు సీటులో కూర్చున్నాడు. అయితే వెనుక కూర్చున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎస్ ఐ కుడి చెవిని కొరికాడు. దీంతో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, రోడ్డుపై ప్రమాదం చేయడంతోపాటు ఎస్ఐ చెవి కొరికిన నిందితుడు స్టెనీ రోడ్రిగ్జ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Read Also: MLA Ramireddy Pratapkumar: జగన్ ని వీడితే ప్రాణం పోతుందని.. ఇప్పుడిలా?