India: పాకిస్తాన్‌లో గత కొంత కాలంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్‌లో మరణిస్తున్న ఉగ్రవాదులంతా భారత్‌కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని, వారు భారత న్యాయ వ్యవస్థను ఎదుర్కోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం అన్నారు.
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగుతూనే ఉంది. ఇటీవల భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలు 41 మందిని స్వదేశానికి రప్పించుకోవాలని ఆ దేశాని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 10లోగా వారంతా వెళ్లాలని, ఆ తరువాత దేశంలో ఉంటే దౌత్యవేత్తలకు ఇస్తున్న ప్రత్యేక సదుపాయాలను కట్ చేస్తామని చెప్పింది.
India: భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం ముదురుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఎజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించారు. ఇదే కాకుండా భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. దీనికి బదులుగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలివెళ్లాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ ఈ పరిణామాలపై స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఢిల్లీలో…
Pakistan Foreign Minister's Controversial Comments on Prime Minister Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూఎన్ భద్రతా మండలిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని తూర్పారపట్టారు. ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదికి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందని.. ఇటువంటి దేశం ఉగ్రవాదంపై నీతులు చెబుతుందని విమర్శించారు.
America's warning on China's objections: భారత్, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ‘యుద్ అభ్యాస్’పేరుతో ఉత్తరాఖండ్ లో ఇరు దేశాల సైనికులు సైనిక విన్యాసాలు చేస్తున్నారు. చైనా సరిహద్దు ఎల్ఓసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. అయితే ఈ సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ 1993,96 ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో భారత్ కు అండగా నిలిచింది అమెరికా.
Korean youtuber harassed: ముంబైలో ఇద్దరు ఆకతాయిలు దక్షిణ కొరియా యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నడిరోడ్డుపై యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు. ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో కొరియా యువతికి ఈ పరిణామం ఎదురైంది. ఇది దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ముంబై పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి ఒక రోజు కస్టడీకి తరలించారు. ఈ వీడియో బుధవారం బయటకు…
Indian Embassy Shares 5 Options For Border Crossing To Leave Ukraine Amid War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. క్రిమియాలో కేర్చ్ వంతెన కూల్చేసిన తర్వాత రష్యా దాడులను తీవ్రం చేసింది. వరసగా కామికేజ్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది రష్యా. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు వెంటనే ఉక్రెయిన్ విడిచిపెట్టాలని సూచించింది భారత విదేశీ మంత్రిత్వశాఖ. ఈ నేపథ్యంలో…
13 Indians trapped in fake IT job racket rescued from Myanmar: నకిలీ జాబ్ రాకెట్ వలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించారు. మయన్మార్ దేశంలో ఐటీ జాబ్స్ కోసమని వెళ్లారు 45 మంది భారతీయులు. అయితే అక్కడి వెళ్లాక కానీ తెలియలేదు తామంతా మోసపోయామని. మయన్మార్ లోని మైవడ్డీ ప్రాంతంలో అంతర్జాతీయ జాబ్ రాకెట్ బారిన పడిన 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్…
భారత్ లో మతస్వేచ్ఛపై పదేపదే విషాన్ని గుప్పిస్తున్న యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం ( యూఎస్సీఐఆర్ఎఫ్)పై భారత్ ఘాటుగా స్పందించింది. జూలై 2న భారత్ కు వ్యతిరేఖంగా ఈ సంస్థ పలు ట్వీట్లను పెట్టింది. భారత్ లో ప్రశ్నించే గొంతులను, ముఖ్యంగా మైనారిటీల అణచివేత కొనసాగుతోందని.. దీనిపై వారంతా ఆందోళన చెందుతున్నారని ట్వీట్ చేసింది. దీంట్లో ఇటీవల ముంబైకి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ అరెస్ట్ గురించి కూడా కమిషన్ ప్రస్తావించింది. భారతదేశంలో…
కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు యూఏపీఏ చట్టం కింది ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశానికి వ్యతిరేఖంగా వ్యవహరించడం వంటి కేసులపై ఇటీవల ఎన్ఐఏ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇదిలా ఉంటే కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లోని అక్కడి ప్రభుత్వం, మీడియా, ప్రముఖులు యాసిన్ మాలిక్ శిక్షపై వ్యతిరేఖంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ ఎప్పుడూ కాశ్మీర్ పై నిర్ణయాలు తీసుకున్నా ఆర్గనైజేషన్…