India: ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా.. ట్రూడో ఆరోపణలపై సాక్ష్యాలేవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం ముదురుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఎజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించారు. ఇదే కాకుండా భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. దీనికి బదులుగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలివెళ్లాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ ఈ పరిణామాలపై స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఢిల్లీలో మాట్లాడారు.
కెనడా చేసిన ఆరోపణలపై ఆ దేశం ఎలాంటి నిర్ధిష్ట సమాచారం ఇవ్వలేదని, ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవిగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, అయితే కెనడా ప్రధాని చేసిన ఆరోపణలకు ఎలాంటి విషయాలను పంచుకోలేదని అన్నారు. అయితే కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్ వ్యక్తుల వివరాలను భారత్ అందించినప్పటికీ, కెనడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని బాగ్చీ అన్నారు. ప్రధాని మోడీ ముందు కెనడా పీఎం ట్రూడో ఈ ఆరోపలు చేస్తే వాటిని మోడీ ఖండించారని తెలిపారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Read Also: Pakistan: సంక్షోభ పాకిస్తాన్‌లో ఎన్నికల నగారా.. వచ్చే జనవరిలో ఎలక్షన్స్..
కెనడాలో ఉన్న సిబ్బంది కంటే భారతదేశంలో కెనడా సిబ్బంది ఎక్కువగా ఉందని, వారి దౌత్యపరమైన ఉనికిని తగ్గించుకోవాలని భారతదేశం కోరుతోందని కేంద్రం వెల్లడించింది. ఖలిస్తానీ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 20 మందికి పైగా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాగ్చీ కెనడాను మకోరారు. కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని, కెనడా వీసా ప్రాసెసింగ్ ఖలిస్తాన్ ఉగ్రవాదంతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే ఇరు దేశాలు సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి. ఇరు దేశాలు వారి పౌరులకు ఆయా దేశాల్లో రక్షణ అడ్వైజరీని జారీ చేశాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్ నెలలో కెనడా సర్రే ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఇదే ఇరుదేశాల మధ్య వివాదానికి కారణమైంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..