Korean youtuber harassed: లైంగిక వేధింపులకు గురైన కొరియా యూట్యూబర్ భద్రతకు విదేశాంగశాఖ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korean youtuber harassed: ముంబైలో ఇద్దరు ఆకతాయిలు దక్షిణ కొరియా యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నడిరోడ్డుపై యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు. ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో కొరియా యువతికి ఈ పరిణామం ఎదురైంది. ఇది దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ముంబై పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి ఒక రోజు కస్టడీకి తరలించారు. ఈ వీడియో బుధవారం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే ముంబైలో వేధింపుకు గురైన దక్షిణ కొరియా వ్లాగర్ కు రక్షణ, భద్రత కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. స్థానిక అధికారులు ఆమెకు అవసరమైన రక్షణ కల్పించారని అనుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.
Breaking News: In a viral video, Mobeen Chand Mohammad Shaikh and Mohammad Naqeeb Sadrealam Ansari – arrested for molesting a Korean woman YouTuber during a live streaming.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Khar Police (Mumbai) registered an FIR u/s 354 IPC and arrested both of them.
+ pic.twitter.com/wSkne3GMLH— Ashwini Shrivastava (@AshwiniSahaya) December 1, 2022
దక్షిణ కొరియా జాతీయురాలు అయిన యూట్యబూర్ మంగళవారం రాత్రి ముంబై లోని ఖార్ ప్రాంతం నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల ఆమెను వేధించారు. బలవంతంగా తమ కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. నిందితులు మోబీన్ చంద్ మహ్మద్ షేక్(18), మహ్మద్ నకీబ్ సదరియాలం అన్సారీ(20)గా నిందితులను గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇందులో ఓ యువకుడు మహిళపై చేయి వేసి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులు ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ ఘటనపై కొరియన్ యూట్యూబర్ స్పందించారు. నాకు వేరే దేశంలో కూడా ఇలాగే జరిగాయి కానీ ఆ సమయంలో నేను ఏం చేయలేకపోయాను. అయితే ఈసారి మాత్రం భారతదేశంలో వేగంగా చర్యలు తీసుకున్నారని.. నేను మూడు వారాలకు పైగా ముంబైలోనే ఉన్నాను.. ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటున్నానని యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ అన్నారు. ఇటువంటి చర్యలు నాపై ప్రభావం చూపించవని.. అద్భుతమైన భారతదేశాన్ని ప్రపంచానికి చూపిస్తానని తెలిపింది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!