Yasin Malik: షాహీద్ ఆఫ్రిది నుంచి ఓఐసీ దాకా అదే తీరు… భారత్ గట్టి జవాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు యూఏపీఏ చట్టం కింది ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశానికి వ్యతిరేఖంగా వ్యవహరించడం వంటి కేసులపై ఇటీవల ఎన్ఐఏ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇదిలా ఉంటే కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లోని అక్కడి ప్రభుత్వం, మీడియా, ప్రముఖులు యాసిన్ మాలిక్ శిక్షపై వ్యతిరేఖంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ ఎప్పుడూ కాశ్మీర్ పై నిర్ణయాలు తీసుకున్నా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ)వ్యతిరేఖంగానే స్పందిస్తుంది. మరోసారి యాసిన్ మాలిక్ విషయంలో కలుగజేసుకుంది. దాని అనుబంధ సంస్థ అయిన ఇండిపెండెంట్ పర్మినెంట్ హ్యమన్ రైట్స్ కమిషన్(ఐపీహెచ్ఆర్సీ) యాసిన్ మాలిక్ శిక్షను వ్యతిరేఖించింది.
భారత్ ఓఐసీకి ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ యాసిన్ మాలిక్ శిక్షను తప్పుబట్టడాన్ని ఆమోదించలేనిదిగా అభివర్ణించింది భారత్. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ… ఉగ్రవాదానికి వ్యతిరేఖంగా ప్రపంచం ‘ జీరో టాలరెన్స్’ను కోరుకుంటుందని.. దానికి ఏవిధంగా సమర్థించ వద్దని ఓఐసీని కోరారు. ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ భారతదేశాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ తెలిపింది. మాలిక్ ఉగ్రవాదానికి పరోక్షంగా ఐఓసీ మద్దతు నిచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించ కూడదని.. దానిని ఏవిధంగా సమర్థించవద్దని ఓఐసీని కోరుతున్నట్లు అరిందమ్ బాగ్చీ అన్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
యాసిన్ మాలిక్ కు శిక్ష పడటాన్ని ఇటీవల పాక్ క్రికెటర్ షాహీద్ ఆప్రిది తప్పు పట్టాడు. కాశ్మీరీ వ్యక్తుల గొంతును ఇండియన్ ప్రభుత్వం అణచివేస్తుందని విమర్శించారు. యాసిన్ మాలిక్ ను ఓ పోరాట యోధుడిగా అభివర్ణించారు ఆఫ్రిది. దీనికి ఇండియన్ నెటిజన్స్ నుంచి భారీగానే కౌంటర్లు వస్తున్నాయి. ముందు మీ దేశాన్ని చూసుకోండంటూ విమర్శలు చేశారు. ఓఐసీలో 57 ముస్లిం దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!