భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని చైనా అన్యాయ మైన వాదనలను భారత్ అంగీకరించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చిగురువారం తెలిపారు. “దశాబ్దాలుగా చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలతో సహా సరిహద్దు ప్రాంతాల్లో చైనా గత కొన్నేళ్లుగా నిర్మాణా కార్యకలాపాలను చేపట్టిందన్నారు. చైనాను దౌత్యపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు. స్థానిక జనాభా కోసం రోడ్లు, వంతెనల నిర్మాణంతో సహా సరిహద్దు మౌలిక సదుపాయాలను కూడా భారత ప్రభుత్వం పెంచిందని విదేశీ మంత్రిత్వ…