Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరిలో జనసేన పార్టీ కొత్త కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఇన్చార్జ్ దేవర మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణవ్యాప్తంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నాగాలమ్మ దేవాలయం నుంచి కొత్త కార్యాలయం వరకు కొనసాగింది. పార్టీ కార్యకర్తలు, స్థానిక జనసేన అనుచరులు…
ఇక, 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకోనున్నారు. రాత్రి తిరుమలకు చేరుకుంటారు అని ఆయన చెప్పారు. రెండవ తేదీన తిరుమలలోని ప్రధాన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు.. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పవన్ పాల్గొంటారు అని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వెల్లడించారు.
వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏ నేతలు .. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.