Chittor MLA Arani Srinivasulu Fires On Nara Lokesh: నారా లోకేష్‌పై చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులపై లోకేష్ చేసిన ఆరోపణల్ని ఖండించారు. తనపై లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలపై కాణిపాకం సత్య ప్రమాణానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు. చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలు లేకపోవడంతో.. లోకేష్ తన పాదయాత్రను మధ్యాహ్నం ప్రారంభించి, రెండు గంటల్లోనే ముగించాడని ఎద్దేవా చేశారు. లోకల్ లీడర్లు పేపర్‌లో రాసిచ్చిన అభాండాలను చదివి వినిపించాడని, అతని ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. 2012లో లోకేష్‌కు రాజకీయాలలో ఓనమాలు నేర్పింది తానేనని.. చిత్తూరు జిల్లాలో నాయకులను లోకేష్‌తో పరిచయ కార్యక్రమం పెట్టించానని గుర్తు చేసుకున్నారు. అయితే.. ఆ పరిచయ కార్యక్రమాన్ని పూర్తి చేయని అసమర్థుడు లోకేష్ అని దుయ్యబట్టారు. చిత్తూరులో టీడీపీ పార్టీని పటిష్ట పరిచింది తమ కుటుంబమేనని అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినట్లే.. తనని కూడా సీటిస్తానని చివరి నిమిషంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని ఆరోపణలు చేశారు. లోకేష్ బుడ్డి పాలు తాగే చంటోడు అంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. చిత్తూరు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ, పాల డైరీని మూయించిన చంద్రబాబుకి రైతుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.
Kuwait Woman: భారత్‌లో అదృశ్యమైన కువైట్ మహిళ.. బంగ్లాదేశ్‌లో ఆచూకీ
ఇదిలావుండగా.. సంసిరెడ్డి పల్లెలో లోకేష్ మాట్లాడే సౌండ్ స్పీకర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన స్పీకర్ లాక్కోవడంతో లోకేష్, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ నాయకులు & కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కాగా.. నిన్న ఎన్ఆర్ పేటాలో నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడటంపై లోకేష్ సహా పలుపురుపై కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో భాగంగానే పోలీసులు స్పీకర్ స్వాధీనం చేసుకున్నారు.
Mrunal Thakur: దేవుడా.. సీత.. నువ్వు కూడా ఈ రేంజ్ లో చూపిస్తావనుకొలేదు