ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడైనా భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంది. అనేక రంగాల్లో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు విరామం లేదు. అయితే అమెరికా, అరబ్ దేశాలు కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్యంలోని అన్ని రంగాలలో ఏకకాలంలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, అరబ్ దేశాలు ఇరాన్‌తో బ్యాక్‌డోర్ చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.
హిజ్బుల్లా, ఇరాన్‌తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్‌కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. అత్యవసర సమావేశానికి రావాలని అరబ్ దేశాలను రష్యా ఆహ్వానించింది. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల దాడి చేయడాన్ని అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను హెచ్చరించింది.
పాలస్తీనాను సభ్యదేశంగా చేయాలనే ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ మద్దతు తెలిపింది. పాలస్తీనాకు మద్దతుగా ఓటేసింది. ఐక్యరాజ్యసమితిలో అరబ్ దేశాల సమూహం సమర్పించిన తీర్మానంలో పాలస్తీనా సభ్యత్వానికి పూర్తి అర్హత కలిగి ఉందని పేర్కొంది.
McDonalds Controversy: అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహారాన్ని అందించే విషయంలో స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు అధిక బరువుతో ఉన్నారు. 15 శాతం మంది స్త్రీలు, 11 శాతం మంది పురుషులకు ఊబకాయం సమస్య, అంటే వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 లేదా అంతకంటే ఎక్కువ. కానీ ఊబకాయంలో ఈ వ్యత్యాసం ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటుంది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో పురుషులు, స్త్రీల మధ్య ఊబకాయంలో అత్యధిక తేడాలు ఉన్నాయి.
Iran-Saudi Arabia: అరబ్ ప్రపంచంలోనే బద్ధ శత్రువులుగా ఉన్న ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య మళ్లీ సంబంధాలు మొదలువుతున్నాయి. గత కొన్ని దశాబ్ధాలుగా ఇరు దేశాల మధ్య తీవ్రమైన వైరం ఉంది. అయితే తాజాగా చైనా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కూడా దౌత్య సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధం అయ్యాయి. ఇరు దేశాలు కూడా రెండు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలు తెరిసేందుకు అంగీకరించాయి. మిడిల్ ఈస్ట్ లో యెమెన్, సిరియా వంటి దేశాల్లో ఘర్షణలకు, భద్రతా ముప్పుకు…