పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. అత్యవసర సమావేశానికి రావాలని అరబ్ దేశాలను రష్యా ఆహ్వానించింది. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల దాడి చేయడాన్ని అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రష్యా కీలక సమావేశానికి పూనుకుంది. ఈ సమావేశంలో అరబ్ దేశాలతో రష్యా చర్చిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: BC Janardhan Reddy: రేపటి నుంచి అస్సాంలో మంత్రి జనార్ధన్ రెడ్డి పర్యటన.. రహదారుల ఆస్తుల నిర్వహణపై సమీక్ష
ఇదిలా ఉంటే ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసేందుకు రెడీ అవుతోంది. ఇరాన్‌కు చెందిన చమురు, అణు కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక ఐడీఎఫ్ అయితే.. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేసేందుకు ప్రణాళిక వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇరాన్‌పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి పశ్చిమాసియా టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: Prashant Kishor: కొత్త పార్టీ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. పార్టీ పేరు ఇదే..!
ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా సాయంతో గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. అయితే కొన్ని మాత్రం టెల్‌అవీవ్, జెరూసలేం సమీపంలో పడ్డాయి. అయితే ఇజ్రాయెల్ ముందుగానే తమ ప్రజలకు మొబైల్, టీవీల ద్వారా సందేశం ఇచ్చింది. ఎయిర్ రైడ్ సైరన్‌లు మోగించింది. దీంతో ఇజ్రాయెల్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో ప్రాణనష్టం జరగలేదు అని ఇజ్రాయెల్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Minister Seethakka: మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు