ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి (నవంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ హాజరుకావటం లేదు. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే…
కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. పీఐడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలు, నూతన పద్మశాలీ భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఆయన ఫోటోలు దిగారు. మంగళగిరి-విజయవాడ…
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి అధికారంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ నేటి యువతకు రోల్ మోడల్గా నిలిచారు రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత జఠిలమైనదైనా తన దృష్టికి వచ్చిన వెనువెంటనే స్పందించడం, పరిష్కారమయ్యే వరకు వెంటపడడటం.. ప్రజాసేవలో మంత్రి లోకేష్ నిబద్ధత, చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. చాలీచాలని ఆదాయాలతో బతుకు భారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేందుకు ఎడారి దేశాలకు వెళ్లి…
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. ఈదుపురంలో మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లిన సీఎం.. ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం జానకమ్మ అనే మహిళకు బాబు ఒంటరి మహిళ పింఛను అందజేశారు. సీఎం తన ఇంటికి రావడంతో జానకమ్మ సంతోషం వ్యక్తం చేశారు. Also Read: CSK- IPL 2025: రిటెన్షన్ను సీఎస్కే చాలా అద్భుతంగా…
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ను అందజేశారు. శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన సీఎం.. టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడుతూ.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. Also Read: Vikkatakavi…
పదోతరగతి విద్యార్థి వెన్నెల తల్లిదండ్రులు మధురపూడి విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిశారు. తమ కుమార్తె విషయంను పవన్ దృష్టికి వెన్నెల కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ నేడు పవన్ కాన్వాయ్కి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ వారికి భరోసా ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడు లంకకు చెందిన వెన్నెల.. సెలవు రోజుల్లో…
దేశవ్యాప్తంగా ‘దీపావళి’ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పూజలు, నోములు, దీపాలతో యావత్ దేశం ఘనంగా దీపావళి జరుపుకుంది. గురువారం రాత్రి అయితే పటాసుల పేలుళ్లతో దేశం మొత్తం మార్మోగిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా బాణసంచాను కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఓ వింత ఆచారంను పాటించారు. దోర్నాల మండలం వై.చర్లోపల్లిలో దీపావళి పండుగ సందర్భంగా ఓ వింత ఆచారాన్ని గ్రామస్తులు ఆనవాయితీగా…
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో.. కంచిలి మండలం బారువా సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు అయ్యాయి. నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు కాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఆటో అదుపు తప్పడం వలనే ఈ ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇస్సకోడేరులో…
అనంతపురం కలెక్టరేట్లో వెపన్ మిస్ ఫైర్ ఘటన కలకలం సృష్టించింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కలెక్టరేట్లో గార్డు డ్యూటీలో ఉన్న (1996 బ్యాచ్ AR HC 2242) సుబ్బరాజు 303 వెపన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. ఛాతీలో నుంచి బుల్లెట్ బయటకు వెళ్లిపోయింది. త్రీవంగా గాయపడిన సుబ్బరాజును అక్కడే ఉన్న గార్డు సిబ్బంది చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు. Also Read: Ind vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్…