మెగా పేరెంట్స్ డే ప్రచారానికి తప్ప ప్రయోజనం ఏమైనా ఉందా? అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని ప్రచారాల కోసం ఖర్చు చేశారని మండిపడ్డారు. కొంత మంది తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇచ్చి కార్యక్రమం నిర్వహించారని ఎద్దేవా చేశారు. టీడీపీ చర్యల వలన పిల్లలు బడికి కాకుండా.. పనికి వెళ్తున్నారన విమర్శించారు. విద్యా విధానంలో ప్ప్రభుత్వం చేపట్టే విధివిధానాలను తల్లిదండ్రులకు చెప్పలేకపోయారని శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శనివారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మీట్ నిర్వహించారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌పై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ‘మెగా పేరెంట్స్ డే వలన ఉపయోగం ఏమిటి?. విద్యా విధానంలో టీడీపీ చేసిన మేలు ఏమైనా ఉందా?. మెగా పేరెంట్స్ డే ప్రచారానికి తప్ప.. ప్రయోజనం ఏమైనా ఉందా?. ప్రభుత్వ ధనాన్ని ప్రచారాల కోసం ఖర్చు చేశారు. కొంత మంది తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇచ్చి కార్యక్రమం నిర్వహించారు. అమ్మఒడి, పాఠశాలలో ఇబ్బందులు ప్రశ్నించకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. టీడీపీ చర్యల వల్ల పిల్లలు బడికి కాకుండా.. పనికి వెళ్తున్నారు’ అని మండిపడ్డారు.
‘మీటింగ్‌లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పారు, ఆ విషయం తల్లిదండ్రులకు తెలీదా?. విద్యా విధానంలో ప్ప్రభుత్వం చేపట్టే విధివిధానాలను తల్లిదండ్రులకు చెప్పలేకపోయారు. ఆరు నెలల కాలంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు ఏ ప్రభుత్వం వైఫల్యం చెందలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరుడుగా, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని ప్రచారం మాత్రమే చేస్తున్నారు. ప్రశ్నించే పార్టీగా చెప్పే పవన్ కళ్యాణ్ విద్యా విధానం గురుంచి ఎందుకు చెప్పలేదు. తమ కూటమి ప్రభుత్వంలో విద్యా విధానం సరిగా లేదని ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు. పదవులు, ఆస్తులు, రాజకీయ భవిష్యత్‌పై ఉన్న శ్రద్ద విద్యార్థులపై లేదు’ అని శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.