Buddha Venkanna: సీఎం చంద్రబాబుకు అన్ని కులాలు అండగా ఉన్నాయి: బుద్దా వెంకన్న
- విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు
- పోలీసులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తా
- వైసీపీ పార్టీ టైటానిక్ షిప్‌లా మునిగిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిందని, సీఎం చంద్రబాబు నాయుడుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులం ఆపాదించిన నీచుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్ని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వస్తే జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును కోరాం అని బుద్దా వెంకన్న చెప్పారు.
ఈరోజు సీపీ రాజశేఖర్ బాబుకు విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం వస్తే.. జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని సీపీని కోరాము. పోలీసులు స్పందించకుంటే, కేసు నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తాను. అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. చంద్రబాబుకు అన్ని కులాలు అండగా ఉన్నాయి. విజయసాయి రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. వైఎస్ జగన్ స్కాంలో జైలుకు వెళతారని తెలిసి ముందుగానే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని విష ప్రచారం చేశాడు విజయసాయి. వైసీపీ పార్టీ టైటానిక్ షిప్‌లా మునిగిపోయింది. కమ్మ కులానికి చెందిన ఆస్తులు లాక్కుంటే చంద్రబాబు వాళ్లకు అండగా నిలబడకూడదా?’ అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు