Rain Alert: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజు సీఎం దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం…
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన కత్తుల దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పక్క పక్క నే ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాల కారణంగానే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. చనిపోయిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. శలపాక గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక…
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈదుపురంలో దీపం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. నేడు ఏలూరు ద్వారకా తిరుమల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐయస్ జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పవన్ దర్శించుకోనున్నారు. అనంతరం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయనునున్నారు. నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లా రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. పాయింట్లకు…
బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన నంబియార్‌కు కోల్పయినందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు. తన అద్భుత నాయకత్వంతో బీపీఎల్‌ను అందరి ప్రియమైన బ్రాండ్‌గా మార్చాడన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అందించిన ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్, భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన టీపీ గోపాలన్ నంబియార్‌ను కోల్పయినందుకు చాలా బాధగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో ఇసుక తీసుకెళ్తున్న లారీలను రైతులు…
సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అమలు చేశారని మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాం.. రాష్ట్రంలో సినారేజ్ చార్జీలు లేకుండా ఇసుక అందిస్తున్నాం.. రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని వెల్లడించారు.
వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు సహృదయ నేస్తాలు స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో సోమవారం కలిసి పలువురు చెక్కులు అందించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. అర్ధరాత్రి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపించనుంది. గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.