Pawan Kalyan: రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు కానీ.. పరిపాలన గాడి తప్పకూడదు: డిప్యూటీ సీఎం పవన్
- కలెక్టర్ల సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు
- విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ.. పరిపాలన గాడి తప్పకూడదని కలెక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజలు తమని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని, వారు తమ ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారన్నారని అధికారులకు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తాము చేయగలమని, వాటిని ప్రజలకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్‌లే పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు అని డిప్యూటీ సీఎం విమర్శించారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, 40 శాఖల అధిపతులు, 26 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకూ సమావేశం కొనసాగనుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘గత ప్రభుత్వం చేసిన పనులు మూలాలు కదిలించేశాయి. ప్రజలు మమ్మల్ని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేం చేయగలం కానీ.. వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్‌లే. గత ప్రభుత్వంలో జరిగిన వాటికి ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎందుకు మాట్లాడరు అనిపించేది. ఒక్కోసారి శ్రీలంకలా మారిపోతుందేమో అనిపించింది. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు. రాళ్లు, రప్పల మధ్య హైదరాబాదు లాంటి నగరం సీఎం చంద్రబాబుకు కనిపించింది. వారసత్వంగా అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే.. అందరూ కలిసి పని చేయాలి’ అని అన్నారు.
Also Read
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
‘మంత్రి నాదెండ్ల మూడు చెక్ పోస్టులు పెట్టినా.. ఎలా పీడీఎస్ రైస్ రవాణా జరిగింది. ఇసుక విషయంలో ఎవరైనా చెయ్యి పెడితే కఠిన చర్యలుంటాయని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏదోటి చేయగలరని నేను బయటి వ్యక్తిగా ఉన్నపుడు అనుకునేవాడిని. అధికారులు ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం చూపించింది. అధికారులు ఎలా ఉండాలంటే.. ఏపీలా ఉండాలనేలా ఇప్పుడు చేయాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు కానీ.. పరిపాలన గాడి తప్పకూడదు. గత ప్రభుత్వం రెవెన్యూ అధికారులతో సినిమా టిక్కెట్లు అమ్మించినా, ఇసుక దోపిడీ చేయించినా ఒక్క అధికారి ఎందుకు మాట్లాడలేదు?.. అంత నిస్సహాయత ఎందుకు?’ అని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!