బంగాళాఖాతంలో ఏర్పడిన డానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈనెల 23న తుఫాన్ తీరం దాటనుంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 23-25న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Nandigam Suresh Remand: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు షాక్ తగిలింది. మంగళగిరి కోర్టు ఆయనకు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో ఆయనకు కస్టడీ ముగియగా.. పోలీసులు ఈరోజు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణకు మరింత సమయం కావాలని పోలీసులు కోరడంతో.. నవంబర్ 4 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం నందిగం సురేష్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య…
అడిగిన డబ్బులు ఇవ్వలేదని.. మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను నరికి చంపేశాడు. అతికిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కంసాలిపేటలో చోటుచేసుకుంది. కొత్తపేట పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ నగీనా తన భర్త బాజీతో కలిసి కంసాలిపేటలో నివాసం ఉంటోంది. షేక్ నాగిన (32) సమోసాల దుకాణంలో పనిచేస్తుంది. ఆమె…
Pawan Kalyan Tour in Gurla: విజయనగరం జిల్లా గుర్లలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. స్థానిక పీహెచ్సీలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. వ్యాధి వ్యాప్తి, కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుర్లలో బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ హడావుడిగా గుర్ల టూర్ ముగించుకున్నారు. ఇన్ ఫిల్టరైజేషన్ పాయింట్ వద్ద అడుగుపెట్టిన ఆయన.. పీహెచ్సీలో బాధితులను చూశారు. గ్రామ ప్రజలతో మాత్రం ఎక్కువగా మాట్లాడలేదు.…
Two Leopards Dead in Chittoor: చిత్తూరు జిల్లాలో రెండు చిరుతపులులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. సోమల మండలంలో ఓ చిరుతపులి చనిపోగా.. యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో మరో చిరుతపులి మృతి కలకలం రేపింది. చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. Also Read: Pinipe Viswarup: మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! చిరుతపులుల మరణాలపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు చిరుత పులులను గోర్ల…
ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు పరామర్శించారు. Also Read:…
Police Commemoration Day 2024: ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఒక పవిత్రమైన కార్యక్రమం అని, ప్రజా సేవ కోసం ప్రాణాలు వదిలిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఏపీలో జీరో క్రైమ్ ఉండాలని, నేరాలు చేయాలంటే ఎవరైనా బయపడేవిధంగా పోలీసులు ఉండాలని సీఎం పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం…
నేడు విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా బాధితులకు అయన పరామర్శిస్తారు. ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ఎస్ఆర్ పేట మంచినీటి పథకంను పరిశీలిస్తారు. నేటి నుండి 27 వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి…
దేశంలో 5జీ నెట్వర్క్ దూసుకుపోతోంది. క్రమ క్రమంగా ఈ నెట్వర్క్ గ్రామాలకు సైతం విస్తరించింది. టెలికాం నెట్వర్క్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. 5జీ సేవలు మరిన్ని మారుమూల గ్రామాలకు చేరవేచే పనిలో ఉంది.
New Liquor Shops In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరచుకొనున్నాయి. 26 జిల్లాల్లో 3, 396 మద్యం దుకాణాలను వ్యాపారులు ప్రారంభించనున్నారు.