సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతులు ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే.. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని మంత్రి నిమ్మల చెప్పారు. గత ఐదు ఏళ్లలో అధికారులతో రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్దితి లేదని.. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులనే రైతుల దగ్గరకు పంపుతోందన్నారు.
పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు వైద్య సహాయంగా సీఎం సహాయనిధి నుండి రూ.8.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ… ‘నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదు ఏళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యంను దూరం చేస్తే.. నేడు సీఎం చంద్రబాబు మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారు. చంద్రబాబు పాలనలో రైతులకు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చింది. రైతులు తమ ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే.. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది’ అని అన్నారు.
‘రైతులు, వ్యవసాయంను గాలికి వదిలేసి ధాన్యం సేకరించే సివిల్ సప్లై కార్పొరేషన్‌ను సైతం తాకట్టు పెట్టిన రైతుల ద్రోహి వైఎస్ జగన్. రైతులను అబద్దాలతో దగా మోసం చేసిన జగన్, వైసీసీ నాయకులకు.. రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదు. గత వైసీసీ ఐదేళ్ల పాలనలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక అవస్థలకు గురయ్యారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యంను కొనుగోలు చేసి రైతులను చంద్రబాబు అన్ని విధాల ఆదుకుంటున్నారు. తొలిసారి కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు సౌకర్యం కల్పించింది. గత అయిదేళ్ళలో అధికారులతో రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్దితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులనే రైతుల దగ్గరకు పంపుతోంది’ అని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.