ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. కాకినాడ పోర్టు వ్యవహారం సహా ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి.. భారీ ఎత్తున జరుగుతున్న రేషన్ బియ్యం…
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సమస్యల పరిష్కారంలో నేడు మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగగా.. ఈరోజు సీఎస్ల నేతృత్వంలోని అధికారుల కమిటీ మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో జరుగుతున్న సమావేశం ఇదే. ఏ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై అధికారుల కమిటీ చర్చించనుంది. ఏపీ పునర్వవ్యస్థీకరణ…
కార్తిక మాసంలో వచ్చే చివరి రోజును పోలి పాడ్యమి (పోలి స్వర్గం) అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి.. చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. అదే సమయంలో పోలి కథను కూడా చదువుకుంటారు. నేడు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలోని గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరిలో పోలి పాడ్యామి స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో రాజమండ్రిలోని పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు కిక్కిరిపోయాయి. స్నానాలు ఆచరించిన…
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా అన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. నిధులు లేవంటూ మాజీ సీఎం వైస్ జగన్ గారిపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆంజాద్ బాషా ఫైర్…
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కేసులకు భయపడి పారిపోయాడు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను కించపరిచేలా సినిమాలు తీశాడని.. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వై.ఎస్.అవినాష్ రెడ్డిల గురించి సినిమా తీయరా? అని ఆర్జీవీని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా అంటూ మాజీ…
టీడీపీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేశ్ భావోద్వేగ పోస్టు చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీను.. తనకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నానని, మీ అన్నగా కుటుంబానికి అండగా ఉంటూ…
తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి ఎవరి జాగీరు కాదని, వైసీపీ పార్టీ నాయకులంతా వస్తారన్నారు. ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడను అని చెప్పారు. తాను అవినీతి చేసుంటే.. విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తాడిపత్రిలోనే కాదు అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం అని వెంకటరామిరెడ్డి చెప్పుకొచ్చారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ… ‘నా తల్లిదండ్రులు నన్ను సంస్కారంతో పెంచారు. నాలుగు సార్లు ఎంపీగా,…
అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలో 14 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నాం అని మంత్రి పయ్యావుల చెప్పారు. నేడు జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచిందని, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఐదేళ్లలో చాలా దారుణాలు చేశారన్నారని, ఆరోజు మూగబోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా, ఎంతటి హోదాలో ఉన్నా తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ నాయకులు నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మంత్రి డోలా ఎద్దేవా చేశారు. Also Read: CM…
స్వగ్రామం నారావారిపల్లెలో సోదరుడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బుధవారం రాత్రే నారావారిపల్లెకు చేరుకున్న సీఎం.. నేడు ఉదయం సోదరుడి కర్మక్రియల్లో పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్ కూడా హాజరయ్యారు. నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలో మంత్రులు వంగలపూడి అనితా, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి, ఎస్ సవితా, వాసం శెట్టి…