Off The Record: కొలికపూడికు కౌంటర్ గా దేవదత్ ను రంగంలోకి దింపిన టీడీపీ..?
- కొలికపూడి దళిత కార్డ్ ప్రయోగంతో టీడీపీ పెద్దలు అలర్ట్..
- నెమలి ఆలయం ఎపిసోడ్ తర్వాత పెరిగిన రచ్చ..
- అప్పుడు ఎమ్మెల్యే వ్యాఖ్యలతో గరం గరంగా రాజకీయం..
- తనను అంతం చేసే కుట్రలు అంటూ కొలికపూడి తీవ్ర ఆరోపణలు..
- నా జాతిని అవమానిస్తే తెగిస్తానంటూ కులం ప్రస్తావన..
- రంగంలోకి దిగిన కొలికపూడి సామాజికవర్గం నేత దేవదత్..
- ఎమ్మెల్యేకి గట్టి కౌంటర్స్ ఇస్తున్న దేవదత్..
- పార్టీ లెక్కలతో పాటు పర్సనల్ వైరం కూడా ఉందా?..
- గత ఎన్నికల్లో తిరువూరు టిక్కెట్ ముందు దేవదత్కే ఖరారు..
- నెల రోజుల ముందు రంగంలోకి కొలికపూడి..
- కొలికపూడి తనకు టిక్కెట్ రాకుండా చేశారన్న కోపం కూడా ఉందా?..
- దేవదత్ స్వామి కార్యం, స్వకార్యం నెరవేర్చుకుంటున్నారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది. ఆయన ఏం మాట్లాడినా, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా సంయమనం పాటించడం, పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వార్నింగ్ ఇవ్వడం వరకే పరిమితమైన అధిష్టానం ఇప్పుడు ఉలిక్కిపడి దిద్దుబాటు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొలికపూడి ఇటీవల కొత్తగా దళిత కార్డ్ ప్రయోగించడంతో పార్టీ పెద్దలు కూడా అలర్ట్ అయ్యారట. ఆయనకు అదే రేంజ్లో కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలిసింది. ఇప్పటివరకు ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. అలాగే అధికారంలో ఉన్న తమ పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి అధిష్టానం అగ్రహానికి గురయ్యారాయన. ఈ క్రమంలోనే… నియోజకవర్గంలో ఉన్న నెమలి ఆలయంలో వేణుగోపాల స్వామి కళ్యాణానికి పట్టువస్తాలను సమర్పించే వ్యవహారంలో వివాదాస్పదమైంది. అప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశమైంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఎంపీ ప్రయత్నించగా… వాటిని ఎమ్మెల్యే లాక్కుని సమర్పించడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందట. ఆ ఎపిసోడ్లో ఎంపీ కేశినేని టార్గెట్‌గా ఎమ్మెల్యే కొలికపూడి చేసిన కొన్ని వ్యాఖ్యలతో తిరువూరు రాజకీయం గరంగరంగా మారిపోయింది.
ఎమ్మెల్యే దళిత వాదనను తెర మీదికి తీసుకురావడంతో వ్యవహారం కొత్త టర్న్ తీసుకుందని అంటున్నారు. ఎమ్మెల్యే అయి ఉండికూడా తాను నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతున్నానని, తనను అంతం చేసే కుట్రలు కూడా జరిగాయంటూ చాలాపెద్ద ఆరోపణలే చేశారు కొలికపూడి. నాతో సంబంధం లేకుండా నా నియోజకవర్గంలో ఎంపీ కార్యకర్తల సమావేశం పెట్టబోయారు. అదేపని ఆయన వేరే సెగ్మెంట్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే. అలా ప్రశ్నిస్తూనే…. నన్ను అవమానిస్తే భరిస్తాగానీ….నా జాతిని అవమానిస్తే తెగిస్తానంటూ కొత్తగా కులం ప్రస్తావన తీసుకురావడం కలకలం రేపింది. దీంతో టీడీపీ నాయకులు కూడా ఇదేదో తేడా కొట్టేలా ఉందంటూ అలర్ట్ అయిపోయి… అట్నుంచి కూడా అదే కోణంలో కొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారట. ఎంపీ కేశినేని చిన్ని వర్గంలో ఉన్న కొలికపూడి సామాజిక వర్గానికి చెందిన నేత తాజాగా మాట్లాడ్డం అందులో భాగమేనని అంటున్నారు. స్థానిక నాయకుడు, రాష్ట్ర ఆర్గానిక్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ దేవదత్ రంగంలోకి దిగడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. ప్రస్తుతం దేవదత్ నియోజకవర్గంలో అన్ని విధాలా కొలికపూడి తీరును ఎండగడుతున్నారు. అసలు కొలికపూడిని నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, పార్టీ అధిష్టానం తన మీద చర్యలు తీసుకున్నా సరే… ఆ విషయంలో తగ్గేది లేదని, ఎమ్మెల్యే సంగతి తెలుస్తామంటూ నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాల్లో తరచూ అంటున్నారట దేవదత్.
Also Read
- Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
- Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
- Off The Record: నెల్లూరు జడ్పీ పీఠంపై టీడీపీలో అసంతృప్త రాగాలు.. అన్నీ వాళ్ళ కోటాకేనా అంటూ అసహనం
- OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్!
దీన్నిబట్టి చూస్తుంటే… ఇక నుంచి ఎమ్మెల్యే ఏం మాట్లాడినా దేవదత్ నుంచి గట్టి కౌంటర్స్ పడతాయని అంటున్నారు. ఇదంతా పైకి కనిపిస్తున్న కారణం అయితే… దేవదత్ అలా రెచ్చిపోవడం వెనక మరో యాంగిల్ కూడా ఉందట. ఇద్దరి మధ్య పాతపగలు కూడా ఉన్నాయంటూ సరికొత్త అనాలసిస్ చేస్తున్నారు కొంతమంది. కార్పొరేషన్ ఛైర్మన్‌కు ఎమ్మెల్యే మీద వ్యక్తిగత కోపం కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు కారణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా మొదట దేవదత్నే నిర్ణయించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం మూడేళ్ల పాటు తిరువూరులో పనిచేశారాయన. కానీ… ఎన్నికలకు నెల రోజులు ముందు సీన్ మార్చేసి కొలికపూడి శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది అధిష్టానం. ఇప్పుడు అదే నాయకుడితో పార్టీ, ఎంపీ సతమతం అవుతున్న పరిస్థితి. అప్పుడు తనకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడానికి కొలికపూడే కారణమన్న కోపం కూడా కలిపి దేవదత్ ఇప్పుడు చెలరేగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకవైపు పార్టీ తరఫున మాట్లాడుతూనే… పనిలో పనిగా తన పర్సనల్ కసిని కూడా తీర్చుకుంటున్నారట. ఇదంతా చూస్తున్న వారు స్వామి కార్యం-స్వకార్యం సామెతను గుర్తు చేసుకుంటున్నారు. అయితే… ఈ కొత్త యాక్షన్‌కు ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్.
తాజావార్తలు
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
-
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!