Vijaysai Reddy: ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు.. మాది న్యూట్రల్ స్టాండ్!
- కూటమిలో చేరే ఆలోచన లేదు
- ఇండియా కూటమి, ఎన్డీఏలకు సమాన దూరం
- రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని, తమది న్యూట్రల్ స్టాండ్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇండియా కూటమి, ఎన్డీఏలకు తాము సమాన దూరం అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయం చెబుతాంని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పిన మాట ఎప్పుడు చెయ్యలేదని, బాబు చేతుల్లో జనం నాలుగోసారి మోసపోయారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు.
‘ఇండియా కూటమి, ఎన్డీఏ.. రెండింటికీ మేం సమాన దూరం. ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు, మాది న్యూట్రల్ స్టాండ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట మా అభిప్రాయం చెబుతాం. ప్రాథమిక దశలో మేం వ్యతిరేకించలేదు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చేసే ఆందోళనలతో సమిష్టిగా పోరాటం చెయ్యాలి. సామాన్యులపై విద్యుత్ భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం’ అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
‘సీఎం నారా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పిన మాట ఎప్పుడు చెయ్యలేదు. చంద్రబాబు చేతుల్లో జనం నాలుగోసారి మోసపోయారు. నాణ్యమైన విద్య, వైద్యం ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి.. నాణ్యమైన మద్యం అమ్మకాలకు మాత్రమే పరిమితం అయ్యింది. మా హయాంలో మెరుగైన విద్య, వైద్యంను అందించాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యుత్ భారం తగ్గించే వరకు పోరాటం చేస్తాం’ అని గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..