కూటమి ప్రభుత్వం విద్యత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 27 నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గం వారీగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని, ప్రజలను భాగస్వాములు చేస్తూ కార్యక్రమాన్ని వియవంతం చెయ్యాలని కార్యకర్తలను కోరారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనిపించలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అబద్దాలని ప్రజలకు వివరిస్తాం అని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి మరీ దారణంగా ఉందని, రైతులను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.
విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ…’కూటమి ప్రభుత్వం విద్యత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల 27 కార్యక్రమం చెపట్టాలని నిర్ణయించాం. నియోజకవర్గం వారీగా నిర్వహించాలని, ప్రజలను భాగస్వాములు చేస్తూ కార్యక్రమాన్ని వియవంతం చేస్తాం. ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చారు. సూపర్ సిక్సర్ అన్నారు, అవి ఎక్కడా కనిపించలేదు. రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచం కదా, తగ్గిస్తామని ఎన్నిక ముందు చెప్పారు. ఇప్పుడు భారీగా పెంచారు. మీరు ఇచ్చిన హామీలు అబద్దాలని ప్రజలకు వివరిస్తాం. విద్యుత్ ఛార్జీలు పెంచి ధర్నాలు చేస్తే కాల్పులు జరిపిన ఘనత మీదే. రైతుకు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం. రెండు వందలకు తక్కుగా వాడిన ఎస్సీ వర్గానికి బిల్లు లేకుండా చూశాం. ఇప్పుడు జిల్లాలో గిరిజన గ్రామాలలో కనీసం మూడు వేల నుంచి నాలుగు వేలు బిల్లు వస్తోంది. దీనిపై ప్రతీ ఒక్కరిని కలిసి వివరిస్తాం’ అని అన్నారు.
‘బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో మాపై విమర్శలు చేశారు. ఇప్పుడు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. రైతాంగం పరిస్థితి మరీ దారణంగా ఉంది. అన్నదాత సుఖీభవ అనే పథకం పెట్టారు.. కానీ ఎక్కడగా అమలు కావడం లేదు. మొక్క జొన్న, వరి పంట నీట మునిగి నష్టపోయారు. గతంలో ఇలా నష్టాలొస్తే ఈ క్రాప్ ద్వారా నష్టపరిహారం అందేది. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ ఎత్తేసారు. రైతులే ఇన్స్యూరెన్స్ కట్టుకోమని వదిలేసారు. మూడులక్ష మెట్రిక్ టన్నుల ఫొక్యూర్మెంట్ చేస్తామన్నారు కానీ.. ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కేవలం రెండు లక్షల మేర సేకరించారు. సేకరించిన ధాన్యానికి చెల్లింపులు జరగడం లేదు. మీ వ్యవహామ చూస్తుంటే దళారులకు అమ్ముకోని వదిలేసేలా కనిపిస్తుంది. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదు’ అని హెచ్చరించారు.