తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీవారికి సమర్పించే ప్రసాదాల నాణ్యత బాగా పెరిగిందన్నారు. 5400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు అందజేసే రూ.5 వేల రూపాయలను రూ.10 వేలకు పెంచామన్నారు. ప్రతి నెల తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులును పరిశిలిస్తాను అని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో…
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని ఆర్జీవీ పిటిషన్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని, ఇకపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ కోరారు. ఈరోజు ఆర్జీవీ పిటిషన్పై ఏపీ హైకోర్టు…
సినీ నటుడు, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు.. రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీటుపై చర్చించారట. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అని సమాచారం. ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా చేశారు.…
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. గురువారం ఉదయం తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అనంతరం రెండు రోజుల్లో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ.. తమిళనాడు, శ్రీలంక తీరాలను తాకుతుందని ఐఎండీ పేర్కొంది. తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్టై, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుపానుకు ‘ఫెన్గల్’గా నామకరణం చేశారు. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..? ఈ…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని చెప్పింది. సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక వైపు పయనించే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. Also Read: High Cholesterol: ఈ భాగాలలో…
కావలి రూరల్ మండలం బుడం గుంటకు చెందిన బాలయ్య అనే వ్యక్తి నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఐదేళ్లుగా అధికారులు చూట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాలయ్యను అదుపులోకి తీసుకున్నారు. Also Read: Sambal Conflict: సంభల్లో ఉద్రిక్తత.. యూపీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్ 2007లో అప్పటి ప్రభుత్వం తనకు…
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులకు ఆర్జీవీ హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిన ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు ఆర్జీవీ హాజరుకాకుంటే.. ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్లోని వర్మ నివాసానికి ఇప్పటికే జిల్లా పోలీసులు చేరుకున్నారు. ఈనెల 19న విచారణకి హాజరు కాకుండా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వారం రోజులు గడువు కోరటంతో.. ఆయన…
పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొలువైన ఆలయాల్లో ‘శ్రీ దుర్గా భోగేశ్వరా స్వామి’ దేవాలయం ఒకటి. ఈ ఆలయం నంద్యాల పట్టణంలోని గడివేముల మండలం గడిగిరాయి గ్రామ శివారులోని దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే.. దుర్గాభోగేశ్వరా లింగంగా పూజింపబడే ఈ శివలింగంపై ఏడాదికి ఒక్కసారి కార్తీకమాసంలో సూర్యకిరణాలు లింగంపై పడతాయి. శ్రీ దుర్గ భోగేశ్వరా స్వామి దేవాలయంలో సూర్యకిరణాలు నేడు శివలింగాన్ని తాకాయి. కార్తీక మాసం చివరి…
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు కార్తీక దీపాలు వదిలారు.