క్రికెట్ ఆడుతున్న యువతను ఓ రౌడీ షీటర్ తన అనుచరులతో కలిసి బెదిరించాలని చూశాడు. తాను మద్యం తాగాలని, వెంటనే స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని హల్చల్ చేశాడు. క్రికెట్ ప్లేయర్స్ కాస్త ఓపిక పట్టినా.. రౌడీ షీటర్ మరింత రెచ్చిపోయాడు. సహనం కోల్పోయిన యువత.. రౌడీ షీటర్‌ను చావబాదారు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి తిరుపతిలోని కొత్త రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న యువకులతో మద్యం మత్తులో ఉన్న రౌడీ…
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం బస్సు కొంత దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు పోలీసులు, స్థానికులు బయటికి తీశారు. క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Also Read: IPL 2025: నాలుగు నగరాల్లోనే…
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు నామినేటెడ్ స్థానాలను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరికొన్ని పదవులను భర్తీ చేసింది. ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును నియమిస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రకాశం జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంక్ (డీసీసీబీ)…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గ అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాధ పిల్లలకు నెలకు రూ.5000 చొప్పున తన వేతనం నుండి అందిస్తానని ప్రకటించారు. మిగిలిన జీతం కూడా వారి బాగోగుల కోసమే ఖర్చు పెడతానని పవన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాలం ప్రతి నెల ఒకటో తేదీన 42…
దేశభక్తితో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ తల్లిదండ్రులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని సీఎం హామీ ఇచ్చారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు సీఎం మౌనం పాటించారు. ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో వీర సైనికుడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తన వీరాభిమాని అయిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుతో కలిసి భోజనం చేశారు. పేరంటాలు కోరిక మేరకు ఈరోజు జనసేన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి.. ఆవిడతో కలిసి పవన్ భోజనం చేశారు. అంతేకాదు చీర, లక్ష రూపాయల నగదును కూడా అందించారు. డిప్యూటీ సీఎంను కలవడమే కాకూండా.. భోజనం చేయడంతో పేరంటాలు సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్‌తో పేరంటాలు భోజనం…
డిప్యూటీ కలెక్టర్‌ను తహశీల్దారుగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద రెండు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు ధర్మాసనం ఆదేశాలు…
శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మురళీ నాయక్ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. శుక్రవారం తెల్లవారుజామున చొరబాటు దారుల కాల్పుల్లో ఆయన మరణించారు. కాల్పుల్లో మురళీ నాయక్ మృతి చెందినట్లు గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ కల్లి తండాలో ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరారు. రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో విధులు నిర్వర్తించైనా ఆయన.. భారత్-పాక్…
40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను మంత్రి నారాయణ పరిష్కరించారు. నెల్లూరు సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలన్నంటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈరోజు ఒక పండుగ రోజు అని…
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47 వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. Also Read: Rohit Sharma Retirement: రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ అంతంత మాత్రమే.. గణాంకాలు ఇవే!…