జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అని, బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెపొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం.. మూల సిద్ధాంతం అని చెప్పారు. దేశంలో బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో దృఢమైన నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని పురంధేశ్వరి ప్రశంసించారు. ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన జకియా ఖానం.. కాసేపటి క్రితం కాషాయ కండువా కప్పుకున్నారు.
జకియా ఖానం బీజేపీలో చేరిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… ‘జకియా ఖానం భర్త టీడీపీ తరఫున పని చేశారు. బీజేపీలోకి జకియా ఖానంను ఆహ్వానిస్తున్నాం. బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెపొచ్చు. కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం.. మూల సిద్ధాంతం. వైసీపీకి, పదవికి రాజీనామా చేసి జకియా ఖానం బీజేపీలో చేరారు. బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోంది’ అని అన్నారు.
‘ఆపరేషన్ సింధూర్‌తో దృఢమైన నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారు. బలమైన నాయకత్వం ఉంటే ఎలాంటి పరిణామాలుంటాయో ప్రస్తుత పరిస్ధితులను బట్టి తెలుస్తుంది. ఉరి ఘటనలో దేశ సామర్ధ్యాన్ని ప్రతిపక్షం కూడా అవహేళన చేసింది. ఉగ్రవాదులకు తర్ఫీదు ఇచ్చే స్ధావరాలను మాత్రమే టార్గెట్ చేసాం. ఎల్ఓసీ దాటి చేస్తున్న దాడులను ఉపేక్షించేది లేదంటూ ప్రధాని ప్రకటించారు. న్యూక్లియర్ బాంబు లాంటి బెదిరింపులకు భారతదేశం లొంగదు’ అని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.