వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్పై విడుదల అయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పదివేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. రెండు నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలన్న కోర్టు ఆదేశించింది. గోరంట్ల మాధవ్ ఈ నెల 11 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఇక మాధవ్ సహా…
ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో టార్గెట్ పేరుతో రైతులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మాటల్లో వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువగా ఉండటంతో కొంత సమస్య ఏర్పడిందని, లక్ష్యానికి మించి దాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు వద్ద ప్రతిదాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి మాటలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి ప్రధాని…
విజయవాడ జిల్లా జైల్లో తనకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని కోర్టుకి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. పూజకు పుస్తకాలు, పెట్టుకోవటానికి బొట్టు ఇవ్వటం లేదని జడ్జికి చెప్పారు. తాను విచారణకు సహకరిస్తున్నారని, మరోసారి కస్టడీకి తీసుకున్నా సహకరిస్తానన్నారు. జైల్లో తాను వెళ్లిన తర్వాత తన కారణంగా వేరే వారికి కూడా సౌకర్యాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జైలుకి వెళ్లిన తొలి రోజున టీవీ ఉందని, వాకింగ్ వెళ్లి…
అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి మే 2న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని సభ జరిగే ప్రాంతాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించగా.. తాజాగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని రాక సందర్భంగా 6 వేల మందితో…
అదనపు భూ సేకరణ వల్ల భూమి విలువ పడిపోతుందనే అపోహలు వద్దు అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మేలు ఎప్పటికీ మర్చిపోలేం అన్నారు. రాజధాని పరిధిలో గ్రామ కంఠాల్లో ఉంటూ పట్టాల్లేని వారికి త్వరలోనే పట్టాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం అయ్యారు. ఏ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని పర్యటనకు రైతులను ఆహ్వానించారు. రాజధాని మరలా అభివృద్ధి బాట…
హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై ఏపీ సీఐడీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ సీఐడీ విభాగంలో 28 హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన మహిళా, పురుష అభ్యర్థులు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. Also Read: Rajya Sabha Seat: ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ…
ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. భీమవరంకు చెందిన సత్యనారాయణ.. ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లీనరీ కమిటీ చైర్మన్గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అన్నామలై, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేర్లు రేసులో వినిపించినా.. చివరకు సత్యనారాయణకు అవకాశం దక్కింది. ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. విజయసాయి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమిస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ), విశాఖ డీసీసీబీ ఛైర్మన్గా కోన తాతారావు (జనసేన), కడప డీసీసీబీ ఛైర్మన్గా బి.సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)లు నియమితులయ్యారు. శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్గా అవినాష్ ఛౌదరి (టీడీపీ), విశాఖ డీసీఎంఎస్ ఛైర్మన్గా కొట్ని బాలాజీ (టీడీపీ)లు…
ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఏపీలో ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. అయినా కూడా ఇప్పటివరకు కూటమి నుంచి నామినేషన్ దాఖలు అవ్వలేదు. ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ…