అనంతపురం జిల్లాలో రెండవ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. గుత్తి మండలం బేతేపల్లి గ్రామంలో సోలార్ ప్లాంట్‌కు నేడు మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా శంకుస్థాపన చేయనున్నారు. ఇండియాలో అతి పెద్ద రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దావోస్‌లో ఈ సంస్థ ఏర్పాటులో లోకేష్ కీలక పాత్ర పోషించారు. సుమారు 22 వేల కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. తొలి దశలో 587 మెగా వాట్ల సోలార్, 250 మెగా వాటర్ విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ యూనిట్లతో 7 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ఆ తర్వాత మొత్తంగా 22 వేల కోట్లు పెట్టుబడి రేన్యూ సంస్థ పెట్టనుంది.
Also Read: IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఆరుగురు మ్యాచ్ విన్నర్స్ తిరిగొచ్చేశారు!
మొదటిరోజు గుత్తిలో గుంతకల్లు నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ ప్రాంతీయ సమన్వయకర్త కోవెలమూడి రవీంద్ర, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మంత్రి లోకేశ్ సూచించారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రూ.4 వేల పింఛను ఇస్తున్నామని, మెగా డీఎస్సీ ద్వారా 16500 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలను ఏపీకి తీసుకొస్తున్నామని కార్యకర్తలతో మంత్రి చెప్పారు.