ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా.. జాతీయ జెండా చేత పట్టుకుని నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్.. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, పల్లె సింధూర, బండారు శ్రావణి ఇతర ప్రజా ప్రతినిధులు సహ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ,మాజీ సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నుండి…
పేకాట, ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడిన ఎంతో మంది యువకుల జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. చాలామంది పేకాట, బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. మరికొందరు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పేకాట, ఆన్లైన్ బెట్టింగ్, మద్యంకు బానిసైన ఓ వ్యక్తి కార్లు రెంటుకు తీసుకొని.. యజమానులకు టోకరా వేశాడు. ఈఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడ పెనమలూరులో నివాసం ఉంటున్న కుందేటి సాయిరాం అనే వ్యక్తి పేకాట, ఆన్లైన్ బెట్టింగ్…
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ మండలంలోని జాతీయ రహదారిలో నీలం జూట్ మిల్ దగ్గర ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: IPL 2025: నేటి…
ఏపీలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముంది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. విజయనగరం, మన్యం, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే? తూర్పుగోదావరి, ప్రకాశం, వైఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురుస్తాయని వాతావరణ శాఖ…
ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన.. సీ క్యాంప్ రైతు బజార్లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్న సీఎం నేడు కాకినాడ టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల సమావేశం.. మినీ మహానాడు నిర్వహణపై చర్చించనున్న నేతలు మంత్రాలయం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు.. సాయంత్రం స్వామి వారిని రథంపై ఊరేగింపు నేడు గుంటూరు జిల్లా బొంగరాలబీడు స్మశానవాటికలో ఎలక్ట్రికల్ క్రెమోషన్…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి కోర్టు రిమాండ్ విధించింది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది. పోలీసులు పిటీ వారెంట్ దాఖలు చేసి వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకి కూడా రిమాండ్ విధించింది.…
ఆసియాలో అతిపెద్ద మామిడి మార్కెట్‌గా పేరున్న నున్న ఈసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మామిడి కాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు, వ్యాపారులు, కూలీలతో కళకళలాడాల్సిన మార్కెట్.. ఈసారి వెలవెలబోతోంది. ముఖ్యంగా వ్యాపారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అకాల వర్షాలు, గాలివానలు, కోడిపేను తెగుళ్లతో పంట దిగుబడి భారీగా తగ్గింది. పూత వచ్చినా.. కాయ దశకు రాకముందే పాడైపోయింది. Also Read: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. ఆనందంలో ఆర్సీబీ ఫాన్స్! నున్న మామిడి మార్కెట్లో…
మన నేలపై ఉత్పత్తయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా.. భారతదేశానికి మొత్తం సరఫరా చేస్తాం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదు ఉద్యమం అని పేర్కొన్నారు. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశాం అని, ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్జాజెక్ట్ రూపకల్పన చేశామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. త్వరలోనే…
త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయని విమర్శించారు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్‌లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారని మండిపడ్డారు. రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయని, రాజకీయాల్లో కాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదైంది. మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్లో వంశీపై పిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై నివేదికను ఆయన పోలీసులకు అందించారు. 2019-2024 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీ ఫిర్యాదు మేరకు…