కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసు నమోదైంది. విశాఖలో కోవిడ్ కేసు కలకలం రేపింది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది. మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
Also Read:Pakistan: పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్స్ సపోర్ట్.. జిత్తులమారి చైనా మరో కుట్ర..
కోవిడ్ పాజిటివ్ నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాకినాడ జిజిహెచ్ లో కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 24 బెడ్ లతో జిజిహెచ్ లో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. 1100 కోవిడ్ కిట్లు, ఒక ఐసోలేటెడ్ వార్డ్ ను అందుబాటులోకి తెచ్చారు. 110 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 48 సిలిండర్లు,50 కేఎల్ కెపాసిటీ గల మూడు ఆక్సిజన్ ట్యాంకులు అందుబాటులో ఉంచారు. కేసులు నమోదు అయితే చికిత్స అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారు.
Also Read:Spirit: ‘స్పిరిట్’ దీపికా పదుకొణె అవుట్.. రుక్మిణి వసంత్ ఎంట్రీ!
మహమ్మారి కరోనా వైరస్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడండని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది.