జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గ అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాధ పిల్లలకు నెలకు రూ.5000 చొప్పున తన వేతనం నుండి అందిస్తానని ప్రకటించారు. మిగిలిన జీతం కూడా వారి బాగోగుల కోసమే ఖర్చు పెడతానని పవన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాలం ప్రతి నెల ఒకటో తేదీన 42…
దేశభక్తితో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ తల్లిదండ్రులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని సీఎం హామీ ఇచ్చారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు సీఎం మౌనం పాటించారు. ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో వీర సైనికుడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తన వీరాభిమాని అయిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుతో కలిసి భోజనం చేశారు. పేరంటాలు కోరిక మేరకు ఈరోజు జనసేన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి.. ఆవిడతో కలిసి పవన్ భోజనం చేశారు. అంతేకాదు చీర, లక్ష రూపాయల నగదును కూడా అందించారు. డిప్యూటీ సీఎంను కలవడమే కాకూండా.. భోజనం చేయడంతో పేరంటాలు సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్‌తో పేరంటాలు భోజనం…
డిప్యూటీ కలెక్టర్‌ను తహశీల్దారుగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద రెండు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు ధర్మాసనం ఆదేశాలు…
శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మురళీ నాయక్ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. శుక్రవారం తెల్లవారుజామున చొరబాటు దారుల కాల్పుల్లో ఆయన మరణించారు. కాల్పుల్లో మురళీ నాయక్ మృతి చెందినట్లు గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ కల్లి తండాలో ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరారు. రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో విధులు నిర్వర్తించైనా ఆయన.. భారత్-పాక్…
40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను మంత్రి నారాయణ పరిష్కరించారు. నెల్లూరు సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలన్నంటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈరోజు ఒక పండుగ రోజు అని…
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47 వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. Also Read: Rohit Sharma Retirement: రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ అంతంత మాత్రమే.. గణాంకాలు ఇవే!…
తప్పకుండా అధికారంలోకి వస్తాం అని, అందులో ఎలాంటి సందేహం లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం (కూటమి ప్రభుత్వం) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాకముందు మన పథకాల ద్వారా పేదల…
మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారని.. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా…
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలు పార్టీలో చేశారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘ మాజీ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్ అని పేర్కొన్నారు. జగన్ లాంటి వ్యక్తిని మరలా సీఎం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో పని చేస్తామన్నారు. వైఎస్ జగన్ గారికి సపోర్టుగా ఉండాలని ఉద్యోగ సంఘ…