సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ పరపతి బాగానే పెరిగింది. అంతేకాదు వినూత్న కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లిబాట కార్యక్రమాలు నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్.. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరి కోసం మాటామంతీ’ పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని…
ఇకపై కార్యకర్తల బాధ్యత తనదే అని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని చెప్పారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని వారితో లోకేష్ భేటీ అయ్యారు. Also Read: CM Chandrababu:…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పం నియోజకవర్గం ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఆలయం వద్ద వేద పండితులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సీఎం దంపతులు సారె సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని అమ్మవారిని చంద్రబాబు ప్రార్థించారు. తిరుపతి గంగమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదాలను చంద్రబాబు దంపతులు స్వీకరించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక…
స్కూల్ డేస్‌లో తనది లాస్ట్ బెంచ్ అని, తమది అల్లరి బ్యాచ్ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. స్కూల్లో పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని పేర్కొన్నారు. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి, సీఎం నారా చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ తనకు ఇష్టమైన కొటేషన్ అని…
బోరుగడ్డ అనిల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు గుంటూరు ఆరవ అదనపు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించడంతో పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్‌ను తరలించారు. పీటీ వారెంట్ మీద అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును బెదిరించిన కేసులో అనిల్‌కు రిమాండ్ పడింది. Also Read: AP Cabinet Meeting: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు..…
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు జరగనుందని, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరులో ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. టూరిజం పాలసికి లోబడి కొన్ని ప్రాజెక్ట్‌లు వస్తాయని, వైజాగ్ త్వరలో అద్భుత నగరం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. Also…
రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారని, 9 వేలకు…
ఏపీ ఐసెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఐసెట్ ఫలితాలు ఏయూ వీసీ ప్రొ.రాజశేఖర్ విడుదల చేశారు. ఏపీ ఐసెట్‌లో 95.86 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. విశాఖకు చెందిన మనోజ్ మేకా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. సందీప్ రెడ్డి, కృష్ణ సాయిలకు వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంకులు దక్కాయి. ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. అలానే వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009లో ఫలితాలు పొందవచ్చు. Also Read: Yanamala Rama Krishnudu:…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులన్నీ తేలితే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రూ.3,700 కోట్లు లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా ఆయన ఇంట్లోకి వెళ్లిందన్నారు. 2029 ఎన్నికల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని యనమల చెప్పారు. ప్రత్తిపాడు…
రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్లో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాలు వ్యవసాయరంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు సీఎంకు వివరించారు. Also Read:…