Cyber Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో.. న్యాయవాది నుంచి రూ. 19 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
- డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం
- న్యాయవాది నుంచి రూ. 19 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అమాయకులను బురిడీ కొట్టించి అందినకాడికి దోచేస్తు్న్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తు్న్నారు. ఇటీవలికాలంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు ఎక్కువైపోయాయి. తాజాగా ఏకంగా న్యాయవాదికే ఝలక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ. 19 లక్షలు కాజేశారు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మచిలీపట్నంకు చెందిన ఓ ప్రముఖ న్యాయవాదికి కొన్ని రోజుల క్రితం డిజిటల్ అరెస్ట్ చేస్తామని సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. కర్ణాటక నుంచి డిజిటల్ అరెస్ట్ చేస్తామని బందరుకు చెందిన న్యాయవాదిని బెదిరించారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన న్యాయవాది రూ. 19 లక్షలు కేటుగాళ్ల ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన న్యాయవాది మచిలీపట్నం ఆర్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read
- Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
- Ruchika Singh: "నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి".. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
- Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
తాజావార్తలు
-
MG Hector Plus Diesel: ఎంజీ హెక్టర్ కొత్త డీజిల్ వేరియంట్ విడుదల.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే
-
Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
-
Ruchika Singh: “నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”.. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
-
Fauzi: ప్రభాస్‌కు తల్లిగా అలనాటి అందాల తార.. ‘ఫౌజీ’లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!
-
Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై ప్రీతి జింటా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!