వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి.. సాయంత్రం 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. Also Read: Alluri Seetharamaraju: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పెళ్లి బృందం ప్రాణాలు కాపాడిన బండరాయి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో…
ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్ ఇవాళ ఉదయం 11.30కి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ఆర్టీజీఎస్, ప్రభుత్వ పథకాలు ప్రజల అభిప్రాయంపై సమీక్ష.. ఆపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ ఆధార్టీ సమావేశం హిందూపురం పట్టణంలోనీ భవాని శంకరమఠంలో వెలసిన శారదాదేవి అమ్మవారిని…
నేటితో ముగియనున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీ.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో ఇప్పటికే రెండు రోజులు విచారించిన తుళ్లూరు పోలీసులు నేడు గుంటూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ.. తెనాలిలో నడిరోడ్డుపై జాన్ విక్టర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు కొట్టడానికి నిరసనగా ఆందోళన వల్లభనేని వంశీని నేడు ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు.. హైకోర్టు ఆదేశాల మేరకు వంశీని విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చనున్న పోలీసులు.. ప్రస్తుతం విజయవాడ సబ్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధురాలిని కారు ఆపి స్వయంగా పలకరించారు. అంతేకాదు సదరు మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా తన పార్టీ నాయకుడికి అప్పగించారు. జగన్ ఆదేశాల మేరకు ఆ నాయకుడు స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లి.. దగ్గరుండి మరి వైద్యం అందించారు. అంతేకాదు వృద్ధురాలికి డబ్బు సహాయం కూడా అందించారు. Also Read: Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. జూన్…
జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టాం అని, రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి స్వస్తి పలికామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల కోసం పని చేస్తున్నాయని చెప్పారు. మార్కెట్లో ధరల పెరుగుదల ఉంటే.. సబ్సిడీపై…
అర్ధిక అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు తన మనుషులకే మేలు చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. మహమ్మారి కరోనా సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారని, చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరుగారి పోయాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదలచుకున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీ మహానాడు బహిరంగ సభ తర్వాత కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తాజ్ హోటల్లో జరిగే సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేపు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య ఈ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను బాబు కలిసే అవకాశముంది. యోగా దినోత్సవంకు…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అంతర్వేదికరలో కాపు సంఘాలు వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్నికి అనుమతి లేదు అంటూ పోలీసులు తొలగించారు. పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని అంటూ కాపు సంఘాలు వాగ్వివాదానికి దిగాయి. విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి కాపు సంఘాల నేతలు ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విగ్రహాన్ని మళ్లీ ఇదే ప్లేసులో పెట్టడానికి ప్రయత్నించిన కాపు…
ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశానని.. ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడున్న విశాలమైన కొండలు, లోయలు చూస్తుంటే తన మనసు పులకించిందన్నారు. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గండికోటను మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదు అని పెమ్మసాని విమర్శించారు. నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గండికోటను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి…
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసు యోగాంధ్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అంతేకాదు యువతీ యువకులు…