ప్రధాని నరేంద్ర మోడీ ఓట్లు కోసం చూడరని, దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో ప్రధాని సైతం ఎక్కడా తలవంచరన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత ప్రధానిదే అని స్పష్టం చేశారు. ‘పీఎం-జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము అని డిప్యూటీ సీఎం…
గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కర్ణాటకలో నెల్లూరు పోలీసులు కాకాణిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కాకాణిని నెల్లూరులోని డీటీసీకి పోలీసులు తీసుకొచ్చారు. రేపు వెంకటగిరి మేజిస్టేట్ ముందు కాకాణిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీసుస్టేషన్లో గత ఫిబ్రవరిలో ఆయనపై కేసు నమోదైంది. వైసీపీ…
తెలుగుదేశం నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏంటి సంబంధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రహనించారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉందని.. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాదన్నారు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారని.. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డిని ఇరికించడం దారుణమన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే…
వైసీపీ నేతలు, మాజీ సీఎం వైఎస్ జగన్పై కూటమి ప్రభుత్వంపెట్టినవన్నీ అక్రమ కేసులే అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, తప్పకుండా అన్నీ కేసుల నుంచి ఏమీ లేకుండా బయటకు వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేస్తున్నాం అని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మార్జ్…
విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు అంటూ ఎక్స్లో వైసీపీ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. టీడీపీ నేతలతో విజయసాయిరెడ్డి రహస్య మంతనాలు చేశారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో విచారణకు ముందు మీటింగ్ జరిగిందని వైసీపీ తెలిపింది. తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నంబర్ 27కు విజయసాయిరెడ్డి వెళ్లారని, 13 నిమిషాల తర్వాత అక్కడికి టీడీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారని, ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు చర్చలు జరిగిందని ట్వీట్ చేసింది. మీటింగ్ తర్వాత…
రాబోయే ఎలక్షన్లలో చాలా పోటీ ఉంటుందని, గ్రామంలోని నాయకులు ప్రజలతో మమేకం కావాలని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. తాడిపత్రి ప్రజలకు జేసీ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, తమ కుటుంబానికి తాడిపత్రి ప్రజలే దేవుళ్లు అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా రాజకీయాల్లో కొనసాగాలంటే ప్రజల్లో ఉండాలని జేసీ చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా అని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు.…
ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు . నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత రాయలసీమ ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చిందో, మరల ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదే స్థాయిలో ఆదరణ వచ్చిందన్నారు. ఇరిగేషన్ రంగంలో తెలుగు గంగ, జిఎన్ఎస్ఎస్, హంద్రీనీవా, హెచ్ఎల్ సి ఇలా ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించామన్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టుకే…
ఈ ఏడాది వేసవి కాలంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఈ ఏడాది భిన్నమైన వాతావరణం నెలకొంది. పెద్దగా ఎండల ప్రభావం కనిపించకుండానే వేసవి ముగుస్తోంది.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొమరోలు మండలం తాటిచర్ల మోటు వద్ద కారు లారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు బాపట్ల మండలం స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహానందికి వెళ్ళి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అమాయకులను బురిడీ కొట్టించి అందినకాడికి దోచేస్తు్న్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తు్న్నారు. ఇటీవలికాలంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు ఎక్కువైపోయాయి. తాజాగా ఏకంగా న్యాయవాదికే ఝలక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ. 19 లక్షలు కాజేశారు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంకు చెందిన ఓ ప్రముఖ…