ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) మృతి చెందారు. ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. తాగుడు అలవాటును తప్పించడానికి రవీంద్రను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు. కానీ వైద్యానికి నిరాకరించిన రవీంద్ర.. ఆసుపత్రి నుంచి తప్పించుకుని ఓ హోటల్ లో ఉన్నాడు. అయితే.. ఆయన ఆరోగ్యం క్షీణించి.. బ్లడ్…
ఆనందయ్య మందుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు తయారీ, పంపిణీ చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నామని.. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ మందు వాడటం వల్ల కరోనా తగ్గుతుందని నిర్థారణ కూడా కాలేదని పేర్కొందని..కరోనా సమయంలో ఆనందయ్య మందు తయారు చేసి మా వంతు సహాయం చేయాలని అనుకున్నామన్నారు. కేంద్ర సంస్థ నివేదికల తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నామని..ఎవరి…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం టిడిపికి ఎందుకు పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. “రెండేళ్లలో జగన్ గారు ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది. వచ్చే మూడేళ్లలో యువ సిఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి.”…
కడప జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు… రిమ్స్ లో బ్లాక్ రిబ్బన్స్ తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లకు 40 వేల వేతనం నుంచి 80 వేల కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా విధులలో పాల్గొన్న డాక్టర్లకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు. ఎన్నో నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదంటున్న డాక్టర్లు… న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కారించకపోతే విధులకు…
కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బ్లాక్‌ఫంగస్ పై కీలక సమాచారాన్ని సిఎం జగన్ కు చేరవేశారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు 1179 ఉన్నాయని.. ఇందులో 1068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయ్యిందని తెలిపారు అధికారులు. బ్లాక్ ఫంగస్ వల్ల 14 మంది మృత్యువాత పడ్డారని.. కోవిడ్ లేకున్నా.. బ్లాక్ ఫంగస్ వస్తోందని సీఎంకు అధికారుల వెల్లడించారు. 40…
దేశంలో పెట్రోల్ ధరలు మండి పోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. తాజాగా ఏపీలోనూ ఇదే పరిస్థితి. పెట్రోల్ ధరలు పెంచడంపై సిఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. దేశంలోనే లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ (వంద) దాటిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టి జగన్ రికార్డు సృష్టించాడని లోకేష్ ఫైర్ అయ్యారు. “IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో క్రిస్‌గేల్ సుడిగాలి సెంచరీ రికార్డుని IPL(ఇండియన్ పెట్రోల్…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. కరోనా వైరస్ లాగానే చంద్రబాబు.. రోజుకో వేరియంట్ గా మారుతున్నాడని ఎద్దేవా చేశారు. “కరోనా వైరస్ లాగానే చంద్రబాబు రోజుకో తీరు మారుతున్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు కొత్త వేరియంట్ లా మారుతున్నాడు. బాబూ, నీది మీటర్ గేజ్ పై తిరిగే రైలు. ఈ రెండేళ్లలో రాష్ట్రమంతా గేజి మార్పిడి జరిగి బ్రాడ్ గేజ్ అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ పట్టాల మీదే…
పీఠాధిపతి పదవి కోసం వారసుల మధ్య వివాదం కొనసాగుతుంది. వారసత్వంగా తమకే పదవి ఇవ్వాలంటున్నారు మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి. కాదు తమకే ఇవ్వాలని వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వీలునామా కూడా రాశారని రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ ఆరోపణ చేస్తున్నారు. అయితే ఆ వీలునామా ఫోర్జరీ అంటున్నారు మొదటి భార్య కుమారుడు. తన మొదటి తల్లికి కిడ్నీ దానం చేశానని అప్పట్లో తనకూ వాగ్దానం చేశారని మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్య…
ఈరోజు 14 వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నాడు–నేడుతో వైద్య, ఆరోగ్య రంగంలో పెను మార్పులు తేవడానికి సిద్ధమై మొత్తం 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు ప్రారంభం అయ్యాయి. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతుంది. ప్రతి వైద్య కళాశాలతో…