పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి రాజకీయం చెయ్యాలనుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదని..విద్యార్థుల ఆరోగ్యం, వారి భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని.. పరీక్షలు ఎప్పుడు పెడతామనేది సరైన సమయంలో చెబుతామన్నారు. నారా లోకేష్ కు దొరికినట్టు అందరికీ సత్యం రామలింగరాజులు…
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రాగల 2 నుండి 3 రోజులలో ఋతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. నిన్న మరత్వాడ నుండి ఉత్తరా ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడినది. ముఖ్యంగా ఈ రోజు క్రింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణా రాష్ట్రంలోకి వస్తున్నవి. దీంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఈ రోజు (08వ.తేదీ) ఒకటి రెండు ప్రదేశములలో, మరియు రేపు, ఎల్లుండి…
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతోంది. జగన్ రైతులను గాలికొదిలేశారు. వ్యవసాయాన్ని తుంగలో తొక్కారు అని కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. సేకరించిన ధాన్యానికి డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు. మద్దతు ధర కోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ మరిచిపోయారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి పట్టించుకోవటం లేదు అని తెలిపారు. అనేక వ్యవసాయ పరికరాలపై కేంద్రం…
రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద ఈ నెల 1న గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది. సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెళ్లెల్లు, తమ్ముడు. తమ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై గోదావరిలో దూకి అత్మహత్య చేసుకున్నారు కుమార్తెలు, కుమారుడు. మృతులు ప.గో.జిల్లా కొవ్వూరు బాపూజీనగర్ కు చెందిన అక్క మామిడిపల్లి కన్నా దేవి (34) చెల్లెలు నాగమణి (32), తమ్ముడు దుర్గారావు (30) గా గుర్తించారు.…
వైద్య విద్యార్ధిని వేధింపుల కేసులో నెల్లూరు జీజీహెచ్ మాజీ సూపరిండెంట్ ప్రభాకర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీలు సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక సిఫార్సుల మేరకు సస్పెన్షన్ వేటు పడింది. జూన్ 5 తేదీన జెనా ప్రభాకర్ పై తాత్కాలిక చర్యలు తీసుకుంటూ కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేసింది ప్రభుత్వం.వేధింపుల ఘటన పది నెలల క్రితం జరిగినట్టుగా ఉత్తర్వుల్లో పేర్కోన్న ప్రభుత్వం… రెండు కమిటీలు ఇచ్చిన నివేదిక…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్ని రాష్ట్రాల సిఎంలకు లేఖలు రాశారు. ఈ లిస్టులో ఏపీ సిఎం జగన్ లేకపోవడం గమనార్హం. ఏపీలో cid అధికారులు తనపై మోపిన రాజద్రోహం కేసుతో మొదలు పెట్టి ఆ తరువాత సీబీఐ కస్టడీలో దాడి ఇతర అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఈ విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజు లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాజద్రోహం శిక్షణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని.. రాజద్రోహం సెక్షన్…
ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 4872 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,60,316 కు చేరింది. ఇందులో 16,34,25 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,14,510 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక…
కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా థర్డ్‌వేవ్ పై సీఎం జగన్ ఆదేశాలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ థర్డ్‌వేవ్ కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు సీఎం జగన్. పీడియాట్రిక్ సింప్టమ్స్‌ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని.. ఈ మేరకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం…
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఆ కర్ఫ్యూ కారణంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో దానిని కొనసాగిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కర్ఫ్యూను పొడిగించింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్ కోవిడ్ పై నిర్వహించిన సమీక్షలో… స్వల్ప మార్పులు చేస్తూ జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే జూన్10 తర్వాత ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సమయంలో సడలింపు చేసారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల్లో…
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని కాంట్రాక్టు నర్సుల ఆందోళన చేస్తున్నారు. ప్లే కార్డులతో కోవిడ్ పేషేంట్స్ కు ఇబ్బంది లేకుండా, విధులు నిర్వహిస్తూనే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచాలని,కాంట్రాట్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ డ్యూటీ చేస్తూ కోవిడ్ వచ్చి 15 రోజులు సెలవలు పెడితే జీతం కట్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదంటున్నారు నర్సులు.…