సీఎం జగన్ మోహన్ రెడ్డికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ రాసారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ను 25 లక్షలకు పెంచాలి. ఆధారం కోసం కోవిడ్ పాజిటివ్ టెస్టునే కాకుండా, డెత్ సర్టిఫికెట్ ను కూడా అంగీకరించాలి . అనాధలుగా మారిన పిల్లలకు ఉపశమనం కోసం తక్షణమే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేషన్ వరకూ పిల్లల…
టీడీపీ పార్టీ నుంచి జూమ్ పార్టీ గా మారింది. చంద్ర బాబు నాయుడు జూమ్ పార్టీ అధ్యక్షులు అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కరోనా వచ్చిన జగన్ అని ప్రాజక్ట్ లు పూర్తి చేయడానికి పని చేస్తున్నారు. కరోనా వచ్చాక మీరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కేవలం జూమ్ ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని కూడా అవ్వలేదు. ప్రతి పక్ష నాయుకుడిగా ప్రజల కోసం…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే కేసులు తగ్గుతూ వస్తున్న మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 79,564 శాంపిల్స్ పరీక్షించగా 13,756 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 104 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 20,392 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు…రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. నియెజకవర్గంలోని టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు అని తెలిపారు. మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్ట పరమైన చర్యలకు వెళ్తున్నాం అని తెలిపిన ఆయన డిఎస్పీ, సిఐ, ఎస్సైల అక్రమాలపై కోర్టులో కేసులు వేశాం అని…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబుకు వయసు, టైమ్ అయిపోయిందని.. అందుకే జూమ్ లో కాలక్షేపం చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. “గడియారం ముల్లుపై ఆశలు పెట్టుకుని జూమ్ లో కాలక్షేపం చేస్తుండు. శాశ్వతంగా అక్కడే మిగిలిపోతావు. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. దానితో పోటీపడి పని చేస్తుంటాడు యువ సిఎం. నీకు వయసు మీద పడింది. టైమ్ అయిపోయింది. ముల్లు వెనక్కి తిరగదు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక…
ఇవాళ ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. విజయవాడ ఏపిసిసి భవన్ లో నిరసన కార్యక్రమంలో సాకే శైలజానాధ్, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాకే శైలజానాధ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచేశారని మండిపడ్డారు. మోడీ పబ్లిసిటీ పిచ్చికి.. నేడు ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయలేక పోతున్నారని.. ప్రజలపై పోటీలు పడి భారాలు…
ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.భాస్కర్ ను కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యత ఇసస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టీడీసీ ఎం.డిగా బాధ్యతలు చూస్తున్న ప్రవీణ్ కుమార్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది ప్రభుత్వం. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి ఎస్. సత్యనారాయణకు ఏపీటీడీసీ…
ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛనంగా కనిపిస్తున్నాయి. తాజాగా సిసిఆర్ఏఏస్ కి విజయవాడ పరిశోధన కేంద్రం సానుకూల నివేదిక పంపింది. విజయవాడ, తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు.. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటూ నివేదిక పంపారు పరిశోధకులు. ఆనందయ్య మందుకు అనుమతులు వస్తే…. మందు పంపిణీ చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. రోజుకి లక్ష మందికి మందు పంపిణీ తయ్యారు చేసేందుకు పదార్థాల సేకరణలో ఆనందయ్య…
బ్లాక్ ఫంగస్ కేసుల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అందులో… రాష్ట్రంలో మొత్తం 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన ఇంజెక్షన్లతో కలిపి 3,445 ఇప్పటి వరకు వచ్చిన మొత్తం ఇంజక్షన్లు 5,200. అవసరాల్లో ఇది 10 శాతమే అని తెలిపిన సీఎం వైఎస్ జగన్ కేసుల సంఖ్యను చూస్తే వచ్చే వారం రోజుల్లో కనీసంగా 40 వేల ఇంజక్షన్లు అవసరం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్లు ఏ మూలకు…
వారం రోజుల తర్వాత కృష్ణపట్నం లోని తన నివాసం వద్దకు చేరుకున్నారు ఆనందయ్య. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరినీ అనుమతించం లేదు పోలీసులు.. వారం రోజులపాటు కృష్ణపట్నం పోర్టులోని సివిఆర్ ఫౌండేషన్ లో ఉన్నారు ఆనందయ్య. అయితే పెద్ద ఎత్తున ఆనందయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు గ్రామస్తులు. అయితే నేను ఎక్కడికి వెళ్లడం లేదు ఇక్కడే ఉంటాను. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఇక్కడి నుంచి…