ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు కోసం టీఎన్ఎస్ఎఫ్ వెరైటీగా నిరసన చేస్తుంది. టీడీపీ కార్యాలయం దగ్గర పీపీఈ కిట్లు ధరించి ఆందోళన చేస్తున్నారు. కోవిడ్ సమయంలో అధికారిక సమావేశాలు నిర్వహించ లేనప్పుడు పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని అంటున్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. విద్య శాఖ మంత్రి వెంటనే పరీక్షలు రద్దు ప్రకటించాలి. 14 రాష్ట్రాలు 10 11 తరగతి పరీక్షలు రద్దు చేసినప్పుడు మీ మూర్ఖపు నిర్ణయాలు మార్చుకోవాలి అన్నారు. వ్యాక్సిన్ వచ్చేసరికి పిల్లల్లో తోడుగా వస్తుందని పరిశోధనలో చెప్తున్నారు. 18 నుంచి 45 లోపు వారికి సెప్టెంబర్ దాకా వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదన్న మీరు ఈ నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారు అని అడిగారు.