ఏపీలో ప్రభుత్వ వైన్ షాపుల్లో చేపట్టిన తనిఖీలు ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 266 మద్యం దుకాణాల్లో లెక్కలు బయటకు తీశాయి ప్రత్యేక బృందాలు. సర్కిల్-4 పరిధిలోని వైన్ షాపుల్లో గోల్ మాల్ వెలుగు చుసిన విషయం తెలిసిందే. 35 లక్షల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు సిబ్బంది. సిఐ నాగశ్రీనివాస్ ప్రమేయం నిర్ధారణ కావడంతో అతని పై వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్.ఐ.విమలాదేవి, ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఆ నాలుగు షాపుల్లో…
రెండు సంవత్సరాలలో అని సంక్షేమ పథకాలు అమలు చేశాం. దాదాపు 90 శాతం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం కూడా అమలు చేస్తాం. ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసినందుకు వారికి న్యాయం చేస్తున్నాం అని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంథంగా భావించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. కరోనాతో తల్లితండ్రులు చనిపోయిన పిల్లలకు 10 లక్షల ఆర్థిక సహాయం ఆదిస్తుంది ప్రభుత్వం. తల్లిదండ్రులలో ఒక్కరూ చనిపోయిన…
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కుటుంబం పెద్ద ఎత్తున భూముల ఆక్రమణలకు పాల్పడింది అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఏమ్మెల్యే గా ఉండి ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున దోచుకున్నారు. పల్లా కుటుంబం కబ్జాలు నిర్ధారించుకున్న తర్వాతే వాటిని స్వాధీనం చేసుకుంటున్నాంచంద్రబాబు పెద్ద భూకుంభకోణానికి నాంది పలికాడు. వారి బాటలోనే పల్లా శ్రీనివాస్ ఆక్రమణలకు పాల్పడ్డారు. మా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచింది. మా హయాంలో మా నాయకులు ఎవ్వరు భూకబ్జా లకు పాల్పడలేదు.…
విశాఖలో భూ ఆక్రమణల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. గాజువాక మండలంలో అన్యాక్రాంతమైన యూ.ఎల్.సి.భూములు గుర్తించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అధీనంలో యూ.ఎల్.సి.భూములు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు రెవెన్యు అధికారులు. ప్రస్తుతం విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గా ఉన్నాడు పల్లా. తుంగ్లాం, కాపు జగ్గరాజుపేట పరిధిలో ఆక్రమణలు గుర్తించి కూల్చి వేస్తున్నారు రెవెన్యు యంత్రాంగం. సర్వే నంబర్ 29/1 లో ఉన్న భూమి ఐదెకరాల 42 సెంట్లు భూమిలో ప్రహరీగోడలు తొలగించారు. ఈ…
నేడు విజయవాడలో నాన్ వెజ్ మార్కెట్లపై ఆంక్షలు వర్తిస్తాయి. చేపల మార్కెట్లకు కేవలం 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. మార్క్ ట్ బయట చికెన్, మాటన్ షాపులకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంది. అయితే నగరంలో 144 సెక్షన్ అమ లులో ఉన్నందున మార్కెట్లు, షాపుల్లో ఐదుగురికి మించి గుమికూడకుండా షాపుల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు నగర కమిషనర్. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.…
ఆస్తి పన్ను పెంపు పై సీపీఐ,సీపీఎం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం లో పాల్గున్న సీపీఐ రామకృష్ణ,సీపీఎం మధు,టీడీపీ గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిఎం మధు మాట్లాడుతూ… సీఎం మూడు రాజధానులు అంటారు, బిజెపి ఒకే రాజధాని అంటుంది. అమరావతి పై బిజెపి కి చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రం తో ప్రకటన చేయించాలి. పన్నుల భారాల అంశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. పాపం పెరిగినట్లు ఆస్తి పన్ను కూడా ప్రతి…
ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపాల్ కార్పరేషన్ టాక్స్ పెంచడం దురదృష్టకరం అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఐఎఎస్,ఐపిఎస్ లు ఇతర ఉన్నధికారులు టాక్స్ కట్టనవసం లేదు. ప్రజలు కట్టిన టాక్స్ తో వారు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అందుకే టాక్స్ లు పెంచాలంటు అధికారులు సలహలు ఇస్తున్నారు. ఈ జీవోని తక్షణమే రద్దు చేయ్యాలి అన్నారు. గుజరాత్ టాక్స్ లను వేరు చేసింది ప్రజలపై భారాన్ని మోపలేదు. జీవో రద్దు చేయ్యకుంటే రాష్ట్రమంత నిరసనలు…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ పర్యటనలో కేంద్రంలో కీలకనేత హోం మంత్రి అమిత్ షాతో సహా అయిదుగురిని కలుసుకున్నారు.రైల్వే మంత్రి పీయుష్గోయెల్,నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్,పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్,ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో పాటు నీటి ఆయోగ్వైస్ఛైర్మన్ రాజీవ్కుమార్ను కూడా కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారని అధికారిక సమాచారం. అయితే మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ ఈ పర్యటనకు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కానీ మొదట్లో కంటే ఇప్పుడు కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 8,239 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,93,227 కి చేరింది. ఇందులో 16,85,303 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 96,100 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 61 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఐదో రోజు సీబీఐ విచారణ జరుపుతుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాంలో విచారణ చేస్తుంది సీబీఐ అధికారుల బృందం. ఇక నిన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి,,కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను 8 గంటల పాటు ప్రశ్నించారు. నేడు విచారణకు వివేకా కుమార్తె సునీత వచ్చే అవకాశం ఉంది. ఇక పులివెందులలో వైయస్ వివేకా ఇంటిని పరిశీలిస్తున్నారు సీబీఐ అధికారులు. వైఎస్ వివేకా ఇంటితో పాటు…