అనంతపురం టీడీపీలో తారాస్థాయికి వర్గపోరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ అధికారంలో లేకపోయినా కయ్యానికి కాలు దువ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదట తెలుగు తమ్ముళ్లు. పార్టీ పెద్దల దగ్గర ‘రాజీ’ పడుతున్నట్టు చెబుతున్నా.. బయటకొచ్చాక కుస్తీలే. దీంతో టీడీపీ అధిష్ఠానం కూడా ఆ నియోజకవర్గాలను వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
టీడీపీ పెద్దలకు మింగుడు పడని వర్గపోరు!
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటల్లో అనంతపురం జిల్లా కూడా ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ రెండుచోట్లే గెలిచింది. మిగతాచోట్ల పార్టీ కేడర్ బలంగా ఉన్నా.. నాయకుల మధ్యే అస్సలు సఖ్యత లేదట. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఈ విషయంలో జిల్లాలోని కల్యాణదుర్గం.. శింగనమల నియోజకవర్గాలు టీడీపీ పెద్దలకు మింగుడు పడటం లేదని టాక్.
కల్యాణదుర్గంలో ఆధిపత్యం కోసం పోరాటం!
కల్యాణదుర్గంలో టికెట్ ఇచ్చే దగ్గర మొదలైన గొడవ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని కాదని.. ఉమా మహేశ్వరనాయుడికి నాడు టికెట్ ఇచ్చారు. దాంతో నియోజకవర్గంలో టీడీపీ కేడర్ చౌదరి వర్గం.. ఉమా వర్గాలుగా చీలిపోయింది. స్వపక్షంలోనే విపక్షంగా మారి తన్నుకుంటూ.. అధికారపక్షానికి వినోదం పంచుతున్నారు తమ్ముళ్లు. కలిసి టీడీపీని బలోపేతం చేయాలన్న పార్టీ పెద్దల మాట ఎవరికీ చెవికి ఎక్కడం లేదట. టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా.. కల్యాణదుర్గంలో తెలుగుదేశం తమ అండర్‌లో ఉండాలన్నదే వీళ్ల అజెండాగా చెబుతారు.
సర్దిచెప్పినా కల్యాణదుర్గంలో దారికిరాని వర్గాలు!
కల్యాణదుర్గం మండలం కొండాపురంలో ఇటీవల టీడీపీ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో విందు ఇచ్చారు. దీనికి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఉమా వ్యతిరేక వర్గమంతా హాజరై తీవ్ర మంతనాలు చేసిందట. లోకల్ నాన్‌లోకల్ అంశాన్ని చర్చకు పెట్టాలని నిర్ణయించారట. బయట ప్రాంతం నుంచి వచ్చిన ఉమాకు మద్దతివ్వొద్దని తీర్మానించినట్టు చెబుతున్నారు. దీంతో మళ్లీ రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వాస్తవానికి రెండు వర్గాలకు సర్దిచెప్పడానికి రెండున్నరేళ్లుగా టీడీపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. చంద్రబాబే నేరుగా జోక్యం చేసుకున్నా నో ఛేంజ్. దాంతో కల్యాణదుర్గం నేతలకు చెప్పడం మానేశారట.
శింగనమలలో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం!
ఇంటిపోరుతోనే బలహీన పడుతున్న టీడీపీ!
ఇక శింగనమలలో టీడీపీ అంతర్గత పోరు బలంగానే ఉందట. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రావణి పోటీ చేసి ఓడిపోయారు. ఎస్సీ నియోజకవర్గమేనైనా కమ్మ, రెడ్డి సామాజికవర్గాల నేతలు చెప్పిందే ఇక్కడ వేదం. ఈ వర్గాలకు చెందిన నాయకులకు అస్సలు పడటం లేదట. ఇన్నాళ్లూ గొడవలను మౌనంగా భరిస్తూ వచ్చిన వారు.. అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమైనట్టు సమాచారం. విషయం తెలసుకున్న చంద్రబాబు శింగనమలలోని కొందరు సీనియర్లకు ఫోన్ చేసి వేచి చూడాలని కోరారట. కానీ.. అసమ్మతి నేతలు ఎంత కాలం వేచి చూస్తారన్నది అనుమానమే. జిల్లాలో కల్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో టీడీపీ కుమ్ములాటలను పార్టీ పెద్దలు సరిదిద్దలేని పరిస్థితి ఏర్పడినట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. రానున్న రోజుల్లోనూ ఇదే తీరుగా ఉంటే .. వైసీపీ ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేయకుండానే.. టీడీపీ మరింత బలహీన పడుతుందని ఆందోళన చెందుతున్నారట తెలుగు తమ్ముళ్లు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు